Rakshith Shetty : ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానంటున్న రక్షిత్..!

కన్నడ లో స్టార్ డైరెక్టర్ గానే కాదు స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తెలుగు ఆడియన్స్ కు

Published By: HashtagU Telugu Desk
Rakshith Shetty Interested

Rakshith Shetty Interested

కన్నడ లో స్టార్ డైరెక్టర్ గానే కాదు స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తెలుగు ఆడియన్స్ కు అంతగా తెలియకపోయినా అతను చేస్తున్న సినిమాలను చూస్తే ఒకదానికొకటి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. లాస్ట్ ఇయర్ చార్లీ 777 సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించ్న రక్షిత్ లేటెస్ట్ గా సప్త సాగరాలు దాటి సినిమాతో వచ్చారు. ఆల్రెడీ కన్నడలో హిట్టైన సప్త సాగర్ దాచె ఎల్లో సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని అనుకున్న రక్షిత్ సినిమాకు ఇక్కడ నుంచి వస్తున్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో తెలుగు స్టార్స్ గురించి తన ఒపీనియన్ చెప్పాడు రక్షిత్ (Rakshith Shetty). కన్నడలో కూడా మహేష్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లకు ఫ్యాన్స్ ఉన్నారని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానమని అన్నారు. ఇక తెలుగు స్టార్స్ ని డైరెక్ట్ చేయాల్సి వస్తే ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానని అన్నారు రక్షిత్ శెట్టి.

ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తో రక్షిత్ లాంటి స్టార్ డైరెక్టర్ కం యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఆ కాంబినేషన్ సినిమా అంచనాలకు మించి ఉండాలి. రక్షిత్ సరదాగా అన్నా సరే నిజంగా ఈ కాంబో సినిమా పడితే ఎలా ఉంటుందని సినీ లవర్స్ తారక్ ఫ్యాన్స్ రక్షిత్ ఫాలోవర్స్ ఊహించుకుంటున్నారు.

హీరోగా కన్నా తనకు డైరెక్షన్ అంటేనే ఎక్కువ ఇష్టమన్న రక్షిత్ ఒక సినిమాలో ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యి మిగతా ఎవరైనా సరిగా చేయలేకపోతే అన్న డౌట్ వస్తే తను ఆ సినిమా చేస్తానని అన్నారు. నటుడిగా సంతృప్తికరంగా ఉన్నా డైరెక్షన్ అంటేనే తన ఫస్ట్ ప్రియారిటీ అంటున్నారు రక్షిత్ శెట్టి.

Also Read : Vijay Leo : మున్నా కథనే మళ్ళీ తీస్తున్నారా.. విజయ్ లియోపై వెరైటీ టాక్..!

  Last Updated: 23 Sep 2023, 10:30 AM IST