Raju Weds Rambai OTT : ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Raju Weds Rambai OTT : చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్న విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

Published By: HashtagU Telugu Desk
Raju Weds Rambai Ott

Raju Weds Rambai Ott

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్న విలేజ్ లవ్ స్టోరీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. గత నెల 21న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మంచి కలెక్షన్లతో దూసుకుపోయింది. ఉమ్మడి ఏపీలోని వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్వీ రావు ప్రధాన పాత్రలు పోషించారు. సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Dekhlenge Saala Song: చాల ఏళ్ల తర్వాత పవన్ నుండి ఎనర్జిటిక్ స్టెప్పులు

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అఖిల్ రాజ్ (రాజు) బ్యాండ్ కొట్టడంలో ఫేమస్ కాగా, చిన్నప్పటి నుంచి రాంబాయి (తేజస్వీ రావు)ని ప్రేమిస్తాడు. రాంబాయి మొదట్లో అంగీకరించకపోయినా, రాజు నిజాయతీని చూసి అతడి ప్రేమను అంగీకరిస్తుంది. కానీ, కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునే రాంబాయి తండ్రి వెంకన్న (చైతు జొన్నలగడ్డ) కథలో కీలక మలుపు తీసుకొస్తాడు.

ప్రేమను అంగీకరించని తండ్రిని ఒప్పించడానికి రాజు, రాంబాయి ఒక సాహసోపేతమైన ప్లాన్ వేస్తారు. పెళ్లికి ముందే గర్భవతిని చేస్తే, తండ్రి తప్పకుండా తమ పెళ్లికి అంగీకరిస్తాడని రాజు భావిస్తాడు. రాంబాయి కూడా దీనికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో వారు తీసుకున్న నిర్ణయం తర్వాత ఏం జరిగింది? విషయం తెలిసిన వెంకన్న స్పందన ఏమిటి? రాజు, రాంబాయిలు చివరికి ఒక్కటయ్యారా లేదా అనేదే ఈ సినిమా కథాంశం. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ, ఓటీటీలో కూడా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈటీవీ విన్ వేదికగా ఈ ఎమోషనల్ విలేజ్ లవ్ స్టోరీని మిస్ కాకుండా చూడండి.

  Last Updated: 13 Dec 2025, 09:02 PM IST