సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు అనే విషయం తెలిసిందే. దాదాపు అర్ధ దశాబ్దం తర్వాత ‘లాల్ సలామ్’ అనే రాబోయే చిత్రంతో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్న రజనీకాంత్ ఫస్ట్ లుక్‌ని (First Look) మేకర్స్ విడుదల చేశారు. నటుడు ‘అందరికీ ఇష్టమైన భాయ్ మొయిదీన్ భాయ్’గా రజనీ కాంత్ దర్శనమిచ్చాడు. సన్ గ్లాసెస్‌తో కుర్తా పైజామాలో సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
రెండు భాషల్లో
తన తండ్రి రజినీకాంత్ ను డైరెక్ట్ చేస్తున్న ఐశ్వర్య రజనీకాంత్ ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేసి ‘బ్లెస్డ్’ అని చెప్పింది. లాల్‌సలామ్ బృందానికి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కావాలి!” అంటూ రియాక్ట్ అయ్యింది. ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ పాత్రలో తలైవర్ నటిస్తాడని పోస్టర్ ద్వారా వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ పోస్టర్‌ను ఇంగ్లీష్, తమిళంలో షేర్ చేసింది, రజనీకాంత్‌ను ‘అందరికీ ఇష్టమైన భాయ్ ముంబైకి తిరిగి వచ్చాడు’ అని కామెంట్ చేసింది.
అభిమానులకు నిరాశ
ప్రస్తుతం రజినీకాంత్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన లుక్ పై అభిమానులు (Fans) తీవ్ర నిరాశను గురయ్యారు. ఇదేం లుక్స్.. రజినీ అంటే ఇలా ఉంటారా? వెంటనే మార్చేయండి. మళ్లీ ఫస్ట్ లుక్ ను విడుదల చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. రజినీ టోపి తీసి విగ్ ధరిస్తే బాగుంటుంది అని మండిపడుతున్నారు.
Also Read: Telugu Girl Killed: అమెరికా కాల్పుల ఘటనలో తెలుగు యువతి మృతి!