రజనీకాంత్ బయోపిక్‌‌ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన రజనీ కూతురు

Rajinikanth  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జీవితాన్ని వెండితెరపై చూడాలన్న కోట్లాది మంది అభిమానుల కల త్వరలో నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. తలైవా బయోపిక్‌ (ఆటోబయోగ్రఫీ)పై చాలా కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను విస్తృతంగా […]

Published By: HashtagU Telugu Desk
Rajinikanth Biopic

Rajinikanth Biopic

Rajinikanth  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జీవితాన్ని వెండితెరపై చూడాలన్న కోట్లాది మంది అభిమానుల కల త్వరలో నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. తలైవా బయోపిక్‌ (ఆటోబయోగ్రఫీ)పై చాలా కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ, విజువల్‌ వండర్‌గా ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ‘కోచ్చాడయాన్‌’ వంటి టెక్నాలజీ ఆధారిత చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ బయోపిక్‌లో రజనీకాంత్‌ పాత్రను ఎవరు పోషిస్తారు? దర్శకత్వ బాధ్యతలను ఎవరు చేపడతారు? వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఏది ఏమైనా, ఆటో డ్రైవర్‌ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ అసాధారణ జీవిత ప్రయాణాన్ని వెండితెరపై చూడబోతున్నామన్న వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది.

  Last Updated: 29 Jan 2026, 10:41 AM IST