Rajinikanth: మా నాన్న వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.. సంచలన వాఖ్యలు ఐశ్వర్య రజినీకాంత్!

  • Written By:
  • Updated On - March 9, 2024 / 10:59 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. చాలా కాలం తర్వాత జైలర్ తో మంచిది సూపర్ హిట్ ను అందుకున్నారు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఏకంగా 700 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమాతో సూపర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు.

జైలర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సలాం సినిమా నిరాశపరచడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.లాల్ సలాం సినిమాలో రజినీకాంత్ తో పాటు విష్ణు విశాల్ , విక్రాంత్ నటించారు. లాల్ సలామ్ 9 ఫిబ్రవరి 2024న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం పై ఐశ్వర్య రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి వల్లే తన సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఐశ్వర్య.

లాల్ సలాం సినిమాలో మొహిదీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటించారు అయితే ఆయన పాత్ర వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది అంటుంది ఐశ్వర్య. నిజానికి లాల్ సలాం సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాత్ర కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోవాలట. అయితే ఆయన అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఎలా అంటూ అయన పాత్రను మరింత పెంచారట. దాంతో కథ పెరిగిపోయిందట. సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదే కారణం అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. నిజానికి సినిమా కంటెంట్ బాగుంది. కానీ రజినీకాంత్ ను చూపించిన తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. ఆయన పాత్ర 10 నిమిషాలే అదికూడా ఇంట్రవెల్ లో వస్తారు కానీ సినిమా స్టార్టింగ్ లోనే చూపించాం. కథ కుడా ఆయన చుట్టూ తిరిగేలా మార్చేశాము. దాంతో సినిమా డిజాస్టర్ అయ్యింది అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.