Lal Salaam Trailer: అదరగొడుతున్న రజనీకాంత్ లాల్ సలామ్ ట్రైలర్ విడుదల.. బ్లాక్ బస్టర్ అవడం ఖాయమంటూ?

సూపర్ స్టార్ రజనీకాంత్, విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ద

Published By: HashtagU Telugu Desk
Mixcollage 08 Feb 2024 07 51 Am 238

Mixcollage 08 Feb 2024 07 51 Am 238

సూపర్ స్టార్ రజనీకాంత్, విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగానే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త కథాంశంతో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌‌గా కనిపించి అలరించారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ టైలర్ ను బట్టి చూస్తే ఇందులో రజనీకాంత్ అదరగొట్టేశారు.

అలాగే హీరో విష్ణు విశాల్ కూడా అదరగొట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఈ టైలర్ ని చూసినా రజినీకాంత్ అభిమానులు విష్ణు విశాల్ అభిమానులు తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కథ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాను త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తీసుకురాబోతోంది. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. కాగా ఈ సినిమా విడుదల అవ్వడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

  Last Updated: 08 Feb 2024, 07:52 AM IST