Site icon HashtagU Telugu

Vetayyan Postpone : వెటయ్యన్ కూడా రిలీజ్ డౌటేనా..?

Rajinikanth Vetayyan Postpone News

Rajinikanth Vetayyan Postpone News

Vetayyan Postpone News సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా వేటయ్యన్. రజినీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ తో పాటుగా జానవేల్ మార్క్ కంటెంట్ ఫుల్ సినిమాగా ఇది వస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా వస్తుందని రజినీకి పోటీగా ఎందుకని సూర్య కంగువ కూడా రిలీజ్ వాయిదా వేసుకున్నారు.

సూర్య కంగువ క్లియరెన్స్ ఇచ్చినా సరే వేటయ్యన్ రిలీజ్ అనుకున్న డేట్ కి కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. వేటయ్యన్ (Vetayyan) సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవుతుందని అందుకే సినిమా అనుకున్న విధంగా అక్టోబర్ 10న తీసుకు రావడం కష్టమని అంటున్నారు.

వేటయ్యన్ రిలీజ్ వాయిదా పడితే..

ఐతే వేటయ్యన్ రిలీజ్ పోస్ట్ పోన్ పై మేకర్స్ నుంచి ఎలాంటి స్టేట్ మెంట్ రాలేదు. వేటయ్యన్ రిలీజ్ వాయిదా పడితే ఆ డేట్ కి రిలీజ్ అనుకున్న సూర్య కంగువ మళ్లీ రేసులో ఉంటుందని అంటున్నారు. మరి దసరాకి రజినీ వస్తాడా లేదా సూర్య (Surya) సినిమా వస్తుందా అన్నది చూడాలి. సూర్య కంగువ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. వేటయ్యన్ సినిమాలో రజినితో పాటుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అర్జున్ సర్జా, రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

జైలర్ తో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినికాంత్ (Rajinikanth) మరోసారి తన మార్క్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాతో రజిని అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అన్నది చూడాలి.