Site icon HashtagU Telugu

Nagarjuna Akkineni: నాగ్ బర్త్ డే కి రజనీకాంత్ సర్ప్రైజ్!

Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

కింగ్ నాగార్జున [Nagarjuna Akkineni] 68 ఏళ్ళ వయసులోనూ వరస సినిమాలతో డీసెంట్ ఫ్యాన్ బేస్ తో అలరిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజని కాంత్ [Super Star Rajinikanth] గురించి అందరికి తెలిసిందే ఆయన ఏడుపదుల వయసులో ఇప్పుడున్న కుర్ర హీరోలకి ధీటుగా సినిమాలు చేస్తూ పోతున్నారు రజని… అందులోనూ కుర్ర డైరెక్టర్ లతో అద్భుతాలు సృష్టిస్తున్నారు తలైవా. ఈ ఇద్దరు హీరోలు వారి వారి బాషలలో సినిమాలు చేస్తూనే ఆల్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ని సంపాదించుకొని దూసుకుపోతున్నారు.

ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసారు అని.. అది కూడా రజనీకాంత్ సినిమా నుంచి అని గుసగుసలాడుతున్నారు కొందరు. సూపర్ స్టార్.. ! తమిళ సెన్సేషన్ లోకేష్ కనకరాజు [Lokesh Kanagaraj] డైరెక్షన్ లో చేస్తున్న కూలి [Coolie] సినిమా… ఇప్పుడు టాక్ ఆఫ్ థి ఇండస్ట్రీ అయిపోయింది… అలాంటిది ఈ మూవీ లో కింగ్ నాగార్జున విలన్ రోల్ అంటూ…! గత కొన్ని రోజులుగా నెట్టింట వార్త తెగ చెక్కర్లు కొట్టింది…, కానీ చాల మంది ఈ న్యూస్ నమ్మలేదు… అయితే రీసెంట్ గ కూలి సినిమా టీమ్ ఇచ్చిన అప్డేట్ తో అది నిజమే ఏమో అనిపిస్తుంది.

కూలి సినిమాకి సంభందించి రజని కాంత్ తప్ప వేరే ఎ నటీనటులు వివరాలు వెల్లడించలేదు మూవీ టీమ్… అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మిగతా తారాగణం పేర్లు తెలుపుతున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే నాగార్జున పుట్టినరోజు ముందు ఈ న్యూస్ బయటకి రానుండటంతో…! నిజంగానే కింగ్, తలైవా ఒకటే మూవీ లో నటించబోతున్నారు అని ఫ్యాన్స్ లో ఆశక్తి పెరిగింది. అటు కన్నడ నటుడు ఉపేంద్ర [Upendra Rao] మరియు బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ [Aamir Khan] కూడా కూలి లో నటించబోతున్నారు అనే ఊహాగానాలు గత కొద్దీ రోజులుగా వినిపిస్తున్నాయి …! అయితే ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలో నిజం ఎంతో తెలీదు.