Rajinikanth steps in coolie sets : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’ (Coolie). ప్రస్తుతం రజనీకాంత్ వయసు 73 అయినప్పటికీ తన వయసును ఏమాత్రం లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది జైలర్ హిట్టుతో మరింత జోష్ పెంచిన ఆయన.. ఇప్పుడు రెండు చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వెట్టయాన్ మూవీ కంప్లీట్ చేసిన సంగతి విదితమే. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్ ( Lokesh Kanagaraj)దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుపుకుంటుంది.
ఈరోజు మూవీ సెట్లో ఓనమ్ సందర్భంగా వెట్టియాన్లోని ‘మనసిలాయో’ సాంగ్ కు స్టెప్పులు వేశారు రజని. దర్శకుడు లోకేశ్ ను ఆహ్వానించగా ఆయన నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇటీవల వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా రజనీ, మంజు వారియర్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటె నిన్న చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
గత నెలలో చైనా నుండి లిథియం బ్యాటరీ లోడ్ కంటైనర్ వైజాగ్‌కు వచ్చింది. దీన్ని వైజాగ్ పోర్ట్ ఏరియాలో నిలిపి ఉంచారు. ఇక్కడికి అత్యంత సమీపంగానే కూలీ షూటింగ్ జరుపుకుంటుంది. తొలుత కంటైనర్ నుండి పొగలు రావడాన్ని గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే.. అందులో ఉన్న బ్యాటరీలను బయటకు తీసేశారు సిబ్బంది. కొన్ని బ్యాటరీలు దగ్దమయ్యాయి. దీంతో పెను విపత్తు నుండి బయటపడినట్లు అయ్యింది. షూటింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో భయానికి గురయ్యారు.
Superstar celebrating Onam in style from the sets of #Coolie 🔥💥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/VhVNhmS2hI
— Sun Pictures (@sunpictures) September 15, 2024
Read Also :