Site icon HashtagU Telugu

Rajinikanth : రజినీకాంత్ అసలు పేరు ఏంటి..? ఆయనకు రజిని పేరు ఎలా వచ్చింది..?

Superstar Rajinikanth

Rajinikanth Real Name and When he changed his Name full Details

సూపర్ స్టార్(Super Star) రజినీకాంత్(Rajinikanth).. ఈ పేరు వినబడితే చాలు అక్కడ ఓ రీ సౌండ్ వినబడుతుంది. ఆయనకి తమిళ్, తెలుగు, హిందీ భాషల్లోనే కాదు ప్రపంచం అంతా అభిమానులు ఉంటారు. రజినీకాంత్ అంటే ఒక పేరు కాదు. అది ఒక బ్రాండ్ అనేంతగా సూపర్ స్టార్ ఒక ముద్ర వేశారు. అయితే రజినీకాంత్ అసలు పేరు అది కాదని చాలా తక్కువమందికి తెలుసు. మరి ఆయన అసలు పేరు ఏంటి..? ఆయనకు రజినీకాంత్ అనే పేరు ఎలా వచ్చింది..?

ఇండస్ట్రీలో కొందరు నటులు స్క్రీన్ పై మరో పేరుతో పరిచయం అవుతుంటారు. కొందరి నటీనటుల పేరు పలకడానికి స్టైలిష్ గా లేదని దర్శకనిర్మాతలు మారుస్తుంటారు. కొందరు మాత్రం సంఖ్యా బలం, పేరు బలం బట్టి స్క్రీన్ నేమ్ ని సెట్ చేసుకుంటుంటారు. ఇక రజినీకాంత్ విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు ‘శివాజీరావు గైక్వాడ్‌’. రజిని అభిమానించే హీరో ‘శివాజీ గణేశన్’ పేరులోని సగం తన పేరులో ఉందని ఆయన గర్వపడుతుంటారు. రజిని నటించిన మొదటి మూడు సినిమాల్లో ఆయన ఒరిజినల్ పేరు శివాజీనే వేశారు.

కానీ నాలుగో చిత్రం కె బాలచందర్‌(K Balachander) డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మూన్రు ముడిచ్చి’ అనే తమిళ మూవీ నుంచి రజినీకాంత్ అనే పేరు వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తే.. రజినీకాంత్ ఒక ముఖ్య పాత్ర చేశారు. ఆ మూవీ టైంలోనే దర్శకుడు బాలచందర్‌ రజినీకాంత్ కి ఆ పేరుని ఇచ్చారు. ఆ సమయంలో రజినితో బాలచందర్ ఇలా అన్నారట.. “నీకు శివాజీ అనే పేరు ఇష్టం ఉండవచ్చు. కానీ అది గందరగోళంగా ఉంటుంది. నేను నీ పేరుని రజినీకాంత్ గా మారుస్తున్నాను. నాకు ఎందుకో ఆ పేరు నీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఆ పేరుతో నువ్వు ఎంతో ఖ్యాతి సంపాదించుకుంటావు” అని చెప్పారట. ఆయన అన్నట్లే రజినీకాంత్ పేరు ప్రస్తుతం ప్రపంచమంతటా వినిపిస్తుంది.

 

Also Read : Salaar : జపాన్‌లో కూడా సలార్ గ్రాండ్ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?