Site icon HashtagU Telugu

Rajinikanth Lal Salaam : రజిని సినిమాకేంటి ఈ పరిస్థితి.. ప్రేక్షకులు లేక షో కాన్సిల్..!

Rajinikanth Lal Salaam Shows Canceld In Telugu States For Lack Of Audiance

Rajinikanth Lal Salaam Shows Canceld In Telugu States For Lack Of Audiance

Rajinikanth Lal Salaam సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళంలోనే కాదు రజిని సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా ఆడియన్స్ అలర్ట్ అవుతారు. సూపర్ స్టార్ సినిమా తెలుగులో కూడా రికార్డులు సృష్టించాయి. రజిని లాస్ట్ మూవీ జైలర్ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే జైలర్ తర్వాత రజినికాంత్ లాల్ సలాం సినిమాలో నటించారు.

రజిని కూతురు ఐశ్వర్య రజినికాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ లు లీడ్ రోల్ లో నటించారు. రజినికాంత్ స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమా మీద మొదటి నుంచి ఎందుకో తక్కువ బజ్ ఏర్పడింది. మేకర్స్ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు.

ప్రచార చిత్రాలు కూడా లాల్ సలాం మీద అంచనాలు పెంచడంలో విఫలమయ్యాయి. అయితే నేడు రిలీజైన లాల్ సలాం సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. కేవలం తక్కువ మంది మాత్రమే టికెట్స్ కొనడంతో వారికి తిరిగి డబ్బులు ఇచ్చి షో క్యాన్సిల్ చేశారట.

రజినికాంత్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిందనే కారణమో లేక మరేదో కానీ లాల్ సలాం షోలు క్యాన్సిల్ అవ్వడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ హైలెట్స్ ఇవే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ పక్కా..!