Lal Salaam OTT: రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. కెరియర్ లో ఇదే మొదటిసారి అంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం లాల్ సలామ్‌. ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యంగ్‌ హ

  • Written By:
  • Updated On - February 12, 2024 / 09:02 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం లాల్ సలామ్‌. ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యంగ్‌ హీరోలు విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అలాగే భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, జీవితా రాజశేఖర్‌ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్‌ తో లాల్‌ సలామ్ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజైన లాల్‌ సలామ్‌కు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇంకా చెప్పాలి అంటే తెలుగులో చాలామంది ప్రేక్షకులకు ఈ సినిమా విడుదల అవుతుంది అన్న విషయం తెలియదు.

తెలుగులో సరైన ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయకపోవడంతో ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దానికి తోడు ఈగల్ సినిమా మంచి సక్సెస్ను సాధించడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈగల్ సినిమా పైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం లాల్ సలామ్ సినిమా పరిస్థితి చూస్తుంటే మరొక రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్ల నుంచి తీసేయడం ఖాయం అని తెలుస్తోంది. రజనీకాంత్ కెరియర్ లో ఎప్పుడూ లేనివిధంగా ఇలా ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూడడంతో పాటు సరైన కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల ఈ కనీసం వారం రోజులు కూడా కాకముందే ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫారం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు లోకి వెళితే.. లాల్ సలామ్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్‌, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత 60 రోజులకు లాల్‌ సలామ్ ను స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఇప్పుడు థియేటర్ల దగ్గర లాల్‌ సలామ్‌ పరిస్థితిని చూసి ఈ నిర్ణయాన్ని మార్చుకునేపనిలో ఉన్నారట. అనుకున్న తేదీ కంటే ముందుగానే రజనీ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట. అంటే మార్చి రెండో వారం లేదా మూడో వారంలోనే లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది ఈ సినిమా కలెక్షన్ల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు ఇంత దారుణమైన కలెక్షన్ల, కెరియర్ లో ఇదే మొదటిసారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.. కొందరు సరైన విధంగా పబ్లిసిటీ అలాగే ప్రమోషన్స్ చేయకపోవడమే ఈ ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించిందని కామెంట్లు చేస్తున్నారు.