Viral Photo: తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు, ఏ షోకి హాజరైనా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోస్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా కమల్ హాసన్ వెళ్లి రజినీకాంత్ ని కలిశాడట. కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్, రజనీకాంత్ 170వ సినిమా షూటింగ్ చెన్నైలోని ఒకే థియేటర్ లో జరుగుతున్నాయి. దీంతో రజనీ మరియు కమల్ హాసన్ ఒకే లొకేషన్‌లో షూటింగ్‌లో ఉన్నారు. కమల్ హాసన్ వెంటనే స్నేహితుడు రజినీ వద్దకు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. వీరిద్దరూ సెట్‌లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Lord Shani : శని దేవుడికి ఇష్టమైన ఈ రత్నాన్ని ధరిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?