Site icon HashtagU Telugu

Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. సూపర్ స్టార్ ఊచకోత షురూ..!

Jailer Collections

Jailer Trailer

Jailer Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) జైలర్(Jailer) మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రిలీజైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు రజిని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎగబడుతున్నారు. దీంతో జైలర్ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమే వార్తలు బలంగా వినిపించాయి. ఇక తాజాగా జైలర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ (Jailer Collections) రిపోర్ట్ బయటకు వచ్చింది.

ఈ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా మొదటిరోజు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.43 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి రూ. 109 కోట్లు గ్రాస్, కేరళలో రూ. 5 కోట్లు గ్రాస్, కర్నాటకలో రూ. 10 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 25 కోట్లు గ్రాస్ లభించింది. ఇలా ఇండియా మొత్తంలో ఈ సినిమా రూ. 49 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Amala Paul: పాల్.. పాల్.. అమలాపాల్.. బికినీ షో తో గ్లామర్ హద్దులు చేరిపేస్తున్న బ్యూటీ

అమెరికాలో సైతం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ జైలర్ సినిమా మొదటిరోజు ఏకంగా భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అంతకుముందు విజయ్ బీస్ట్ సినిమాపై ఉన్న రికార్డ్స్ ను జైలర్ క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. జైలర్ కు వస్తున్న భారీ రెస్పాన్స్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇండియాలో ఎవరూ ఊహించని విధంగా రూ. 50 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసిన జైలర్ మూవీ ఓవర్సీస్‌లోనూ ఏకంగా రూ. 30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం.

నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు, వినాయక, తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం జైలర్. ఆగస్టు 10వ తేదీన దక్షిణాది భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షో తోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటిరోజు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.