Site icon HashtagU Telugu

Jailer 2 : రజినీకాంత్ జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ అదిరిందిగా.. పార్ట్ 1 కి మించి ఎలివేషన్స్..

Rajinikanth Jailer 2 Announcement Video Released

Jailer 2

Jailer 2 : రజినీకాంత్(Rajinikanth) హీరోగా 2023 లో వచ్చిన జైలర్ సినిమా భారీ విజయం సాధించి రజినీకాంత్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాలో రజినీకాంత్ కి ఇచ్చిన ఎలివేషన్స్, వేరే హీరోల గెస్ట్ అప్పీరెన్స్ లు అదిరిపోయాయి. రజిని ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఆల్మోస్ట్ 700 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీగానే ఈ సినిమా తెరకెక్కగా మోహన్ లాల్, శివన్న, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్.. ఇలా చాలా మంది స్టార్స్ నటించారు. గతంలోనే ఈ సినిమాకు పార్ట్ 2 అనౌన్స్ చేయగా తాజాగా జైలర్ 2 అనౌన్స్మెంట్ అంటూ ఓ టీజర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ లో డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సరదాగా పడుకొని మాట్లాడుకుంటుంటే వెనకనుంచి రజినీకాంత్ రౌడీలను చంపుతూ వస్తాడు. రజిని ఎంట్రీకి బ్లాస్ట్ లతో అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. దీంతో పార్ట్ 2 లో కూడా రజినీకాంత్ కి ఎలివేషన్స్ భారీగా ఉంటాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని టాక్ నడుస్తుంది. మీరు కూడా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ చూసేయండి..

Also Read : Global Star Ram Charan: ఫ్యాన్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక నోట్‌.. ఏం రాశారంటే?