Site icon HashtagU Telugu

Rajinikanth Suriya : సూర్య నటన చూసి.. వీడు ఎలా నటుడు అయ్యాడు.. అనుకున్నాడట రజినీకాంత్..

Rajinikanth Interesting Comments on Suriya

Rajinikanth Interesting Comments on Suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఒక పాత్ర కోసం నటుడిగా సూర్య పెట్టే కృషి అంతా ఇంతా కాదు. కమల్ హాసన్, హీరో విక్రమ్ తరువాత.. కోలీవుడ్ లో ప్రయోగాలు, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసిన నటుడిగా సూర్య నిలిచాడు. అయితే సూర్య నటన చూసి.. “వీడు ఎలా నటుడు అయ్యాడు” అని రజినీకాంత్(Rajinikanth) మొదట్లో అనుకున్నాడట. ఈ విషయాన్ని సూర్య ముందే ఒక స్టేజీపై రజిని స్వయంగా తెలియజేశాడు.

సూర్య మొదటి మూవీ ‘నెర్రుక్కు నేర్’ సినిమా చూసినప్పుడు రజిని ఇలా ఫీల్ అయ్యాడట. గతంలో జరిగిన ఓ ఈవెంట్లో రజినీకాంత్ స్టేజిపై మాట్లాడుతూ.. సూర్య ఫస్ట్ సినిమా నెర్రుక్కు నేర్ సినిమాలో సూర్యకి హావభావాలు పలికించడం సరిగ్గా రాలేదు. బాడీ లాంగ్వేజ్ బాగోదు. డైలాగ్ చెప్పడం చేతకాలేదు. క్లోజప్ పెట్టినప్పుడు ఫేస్ లో ఎలా ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలో తెలియదు. అసలు ఇతను ఎలా మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాను. కానీ ఆ తరువాత సూర్య తనని తన మార్చుకుంటూ వచ్చిన విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. నందా, గజిని, సింగం.. ఇలా ఎన్నో సినిమాల్లోని పాత్రలను తను తప్ప మరొకరు చేయలేరు అన్నట్లు నటించాడు అని తెలిపారు రజిని.

తెలుగులో రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత అంతటి ఫేమ్ ని సంపాదించుకున్న తమిళ హీరో అంటే సూర్యనే. నిజం చెప్పాలంటే.. తెలుగు ఆడియన్స్ రజిని, కమల్ కంటే సూర్యనే బాగా దగ్గర చేసుకున్నారు. తన సినిమా విడుదలను మాత్రమే కాదు సూర్య పుట్టినరోజు వేడుకను కూడా ఇక్కడ అభిమానులు గ్రాండ్ గా జరుపుతుంటారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ, సోషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ.. ఇక్కడ స్టార్ హీరోల బర్త్ డేస్ ని ఏ రేంజ్ లో చేస్తారో అదే రేంజ్ లో సూర్యకి సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేస్తుంటారు.

 

Also Read : Game Changer: గేమ్ ఛేంజర్ షూటింగ్ షురూ.. చరణ్ పై కీలక సన్నివేశాలు