Jailer 2: జైలర్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్

Jailer 2: ఒక సినిమా హిట్ అయితే, దానికి కొనసాగింపుగా సీక్వెల్ రావడం కామన్ గా మారిన విషయం తెలిసిందే. తమిళ అగ్రహీరో రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అయితే జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వేటయన్ అనే సినిమా చేస్తున్నారు రజిని. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Jailer Collections

Jailer Trailer

Jailer 2: ఒక సినిమా హిట్ అయితే, దానికి కొనసాగింపుగా సీక్వెల్ రావడం కామన్ గా మారిన విషయం తెలిసిందే. తమిళ అగ్రహీరో రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అయితే జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వేటయన్ అనే సినిమా చేస్తున్నారు రజిని.

అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే జైలర్ సినిమాకు సీక్వెల్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. జైలర్ సీక్వెల్ కు ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, అనిరుధ్, నెల్సన్ దిలీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్ వింటేజ్ లుక్‌తో రజనీ కొత్తగా కనిపించారు. తీహార్ జైలు ఎపిసోడ్‌లో పాత రజనీని చూసే అవకాశం కలుగుతుంది. ఇక ఫ్యామిలీ కోసం ప్రాణాలు పణంగా పెట్టే రిటైర్డ్ జైలర్‌గా చాలా హుందాగా, గౌరవప్రదమైన క్యారెక్టర్‌లో జీవించారు. రజనీ గెటప్, బాడీ ల్వాంగేజ్ ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది. మిగితా క్యారెక్టర్లలో కామెడీ టచ్‌తోపాటు కథకు కీలకంగా ఉండే ట్రాక్‌లో సునీల్ క్యారెక్టర్ ఆకట్టుకొంటుంది.

  Last Updated: 22 Jan 2024, 07:29 PM IST