సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. రజనీకాంత్ తమిళ సినిమా సూపర్ స్టార్. అతని గత కొన్ని చిత్రాలు సరైన విజయాన్ని ఆశించిన కలెక్షన్లను అందుకోకపోవడంతో విడుదలకు ముందు జైలర్ పై మిశ్రమ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం కూడా చాలా జాగ్రత్తగా పనిచేసింది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు. సినిమా స్థాయిని పెంచేందుకు రజనీ అభిమానులనే కాకుండా అందరినీ థియేటర్‌కి రప్పించింది ఈ సినిమా సంగీతం.
రజనీకాంత్, రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీంతో ఈ మూవీపై బాలీవుడ్, టాలీవుడ్ సైతం చూసేందుకు ఆసక్తి చూపింది. ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంలో, సినిమా ఓవరాల్ కలెక్షన్‌కి సంబంధించి, ఆగస్టు 25 వరకు మొత్తం 525 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఒక పోస్ట్ లో తెలిపింది. జైలర్ కు మంచి టాక్ వినిపించడం, ఇతర సినిమాలేవీ రేసులో ఉండకపోవడంతో జైలర్ కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి.
ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా రూ.42 కోట్లకు పైగా షేర్‌ను రూ.80 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. అంటే బయ్యర్లు ఈ సినిమా రూ.30 కోట్ల ప్రాఫిట్స్‌ను అందించింది. ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ రేంజ్‌లో ప్రాఫిట్స్ తీసుకురాలేదని డిస్ట్రిబ్యూటర్లే తీర్మానించేశారు. పన్నెండు రోజుల పాటు వరుసగా కోటికి పైగా షేర్ సాధించి తెలుగు బాక్సాఫీస్‌పై అద్భుతాలు సృష్టించింది.
Also Read: Bandi Sanjay: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతమే: బండి సంజయ్