Site icon HashtagU Telugu

Coolie : తలైవా ‘కూలీ’ ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ అప్పుడే

Coolie Trailer

Coolie Trailer

Coolie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజినీకాంత్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.

ఈ సినిమాలో తెలుగు హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్న భాషల నుంచి టాప్ నటులు కలిసి పనిచేస్తుండటంతో ‘కూలీ’ పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సొంతం చేసుకుంది.

సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ ‘కూలీ’కి ట్రైలర్ రిలీజ్ చేయం, నేరుగా సినిమా విడుదల చేస్తాం అని చెప్పి అభిమానుల్లో కాస్త నిరాశ కలిగించారు. అయితే, ఆకస్మాత్తుగా మేకర్స్ పెద్ద అప్‌డేట్‌ను ఇచ్చారు.

Govt Teacher : రూ.70 వేల జీతం తీసుకునే సర్కార్ టీచర్ కు ‘ELEVEN’ స్పెల్లింగ్ రావట్లే..ఏంటి సర్ ఇది !!

సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ఆగస్టు 2న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ రజినీకాంత్ పవర్‌పుల్ లుక్‌తో అభిమానుల్లో హైప్‌ను పెంచింది.

ప్రసిద్ధ నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సత్యన్ సూర్యన్ నిర్వహించారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సులు, సెట్ డిజైన్స్, విజువల్స్ ఇప్పటికే విశేషంగా చర్చనీయాంశంగా మారాయి.

రజినీకాంత్ లేటెస్ట్ పోస్టర్లు, లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ‘కూలీ’ ఎల్‌సీయూ (Lokesh Cinematic Universe)లో భాగమని ఊహాగానాలు ఉండటం కూడా మరింత ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్ రాకతో అంచనాలు మరింత పీక్స్‌కు చేరే అవకాశం ఉంది.

CBN Singapore Tour : మా వద్ద అవినీతి ఉండదు..ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు – చంద్రబాబు