Rajinikanth : రజిని కోరిక తీరబోతుందా..? లేక రజినిని మళ్ళీ బాధ పెడతారా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ కోరిక ఇప్పుడు నిజమయ్యేందుకు ఒక అడుగు దూరంలో ఉంది. మరి ఆ కోరిక నిజంగా మారుతుందా..? లేదా..?

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 10:49 AM IST

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ మూవీ ఈవెంట్ లో ఒక కోరిక కోరారు. ఆ కోరిక ఇప్పుడు నిజమయ్యేందుకు ఒక అడుగు దూరంలో ఉంది. మరి ఆ కోరిక నిజంగా మారుతుందా..? లేదా..? అనేది రేపు చూడాలి.

ఆ కోరిక ఏంటో మీకు ఆల్రెడీ అర్ధమయ్యి ఉండాలి. మన తెలుగు ఐపీఎల్ టీం ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ గత ఆరేళ్లుగా సరైన పర్మఫామెన్స్ ఇవ్వలేక ఆడియన్స్ ని బాధ పెడుతూ వస్తుంది. మంచి రన్ రేట్ ని కూడా మెయిన్ టైన్ చేయలేక చాలా ఇబ్బందులు పడింది. ఇక ఈ టీంని చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆ టీం ఓనర్ అయిన కావ్య మారన్ కూడా తెగ బాధ పడేది. మ్యాచ్ ఓడిపోయిందనే విషయం కంటే, ఆ మ్యాచ్ ని చూసి నిరాశ చెందుతున్న కావ్య బాధ.. అభిమానులను ఎక్కువ బాధించేది.

కేవలం అభిమానులు మాత్రమే కాదు, కావ్య బాధ చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫీల్ అయ్యేవారట. ఈ విషయాన్ని జైలర్ మూవీ ఈవెంట్ లో ఆయన చెప్పుకొచ్చారు. జైలర్ మూవీని కావ్య ఫాదర్ కళానిధి మారన్ నిర్మించారు. దీంతో ఆ మూవీ ఈవెంట్ లో రజిని మాట్లాడుతూ.. ‘ఈసారైనా SRH లో మంచి ప్లేయర్స్ ని తీసుకోని కావ్య పాపని నవ్వించండి. తన బాధ చూస్తుంటే నాకు బాధ వేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

అలా రజిని అడిగారో లేదో.. ఈసారి ఐపీఎల్ లో హైదరాబాద్ టీం కోసం సూపర్ ప్లేయర్స్ ని తీసుకున్నారు. దానికి ఫలితం.. నేడు SRH టీం ఫైనల్స్ కి చేరుకుంది. రేపు KKRతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. మరి ఈ తుదిపోరులో హైదరాబాద్ గెలిచి.. కావ్యతో పాటు రజినిని కూడా సంతోష పరుస్తారేమో చూడాలి.