Site icon HashtagU Telugu

Chandramukhi : ఇక్కడ తమిళ చంద్రముఖి.. అక్కడ తెలుగు చంద్రముఖి..

Rajinikanth Chandramukhi Movie Tamil Song in Tamil Changed

Rajinikanth Chandramukhi Movie Tamil Song in Tamil Changed

2005లో రజినీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కిన హార్రర్ కామెడీ మూవీ ‘చంద్రముఖి'(Chandramukhi). పి.వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ‘జ్యోతిక'(Jyotika) చంద్రముఖి పాత్రలో నటించింది. నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటించగా ప్రభు ముఖ్య పాత్ర చేశాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీ హిట్టుగా ఈ మూవీ నిలిచింది. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ లో చంద్రముఖి పాత్రని తమిళ్ అమ్మాయిగా చూపించారు. ఇక సినిమా చివరిలో చంద్రముఖి నాట్యం చేస్తూ పాడే సాంగ్ ని కూడా తమిళంలోనే చూపించారు.

“వారాయ్‌ నానున్నయ్ తోటి.. వందే నిన్నె ఉక్కుండాడి” అనే తమిళ్ లిరిక్స్ అర్థంకాకపోయినా ఆడియన్స్ ని సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఆ పాటని పలు సాంస్కృతిక కార్యక్రమాలు, స్కూళ్లు, కాలేజీల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రదర్శించేవారు. కాగా ఈ పాటని తెలుగులో తమిళ లిరిక్స్ తో చూపించారు. మరి తమిళంలో ఎలా చూపించారు అని ప్రతి ఒక్కరిలో ఒక సందేహం ఉండేది అప్పటిలో. తమిళంలో ఈ పాటని తెలుగు లిరిక్స్ తో చూపించారు. చంద్రముఖి పాత్రని కూడా తెలుగు అమ్మాయి లాగానే చూపించారు.

ఇక తమిళంలో కూడా తెలుగు సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో పి.వాసు చేసిన ప్రయత్నం రెండు చోట్ల సూపర్ సక్సెస్ అయ్యింది. కాగా ఈ మూవీకి సీక్వెల్ గా గతంలో ‘నాగవల్లి’ అనే సినిమా తెలుగులో తెరకెక్కింది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలు అందుకోలేక ప్లాప్ గా నిలిచింది. నాగవల్లిని డైరెక్ట్ చేసింది కూడా పి.వాసునే. ఇక ఇప్పుడు మరోసారి ఆ మూవీకి సీక్వెల్ అంటూ చంద్రముఖి 2 వస్తుంది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని కూడా వాసునే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 28న రానుంది.

 

Also Read : NTR – Balakrishna : ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్‌లో రావాల్సిన మల్టీస్టారర్.. కానీ..!