Site icon HashtagU Telugu

Vettaiyan : ‘వేట్టయన్’ ట్రైలర్ వచ్చేసింది.. అమితాబ్ వర్సెస్ రజినీకాంత్..

Rajinikanth Amitabh Bachchan Vettaiyan The Hunter Movie Trailer Released

Vettayan

Vettaiyan : రజినీకాంత్(Rajinikanth) త్వరలో వేట్టయన్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మాణంలో TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా వేట్టయన్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రితిక నాయక్, మంజు వారియర్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా వేట్టయన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఎన్ కౌంటర్స్ చేసే పోలీసాఫీసర్ పాత్రలో రజినీకాంత్, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు ఎన్ కౌంటర్స్ తప్పు అని చెప్పే పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో అమితాబ్ వర్సెస్ రజినీకాంత్ లా ఉండనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మాస్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. TJ జ్ఞానవేల్ అంటే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఏం మెసేజ్ ఇస్తారో చూడాలి.

ఇక వేట్టయన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతుంది. మీరు కూడా రజినీకాంత్ వేట్టయన్ ట్రైలర్ చూసేయండి..

 

Also Read : Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున సీరియస్