Vettaiyan: అక్టోబర్ లో ఆ ఇద్దరు హీరోలకు పోటీ ఇవ్వబోతున్న రజనీకాంత్?

టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 170వ సినిమా వెట్టియాన్. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో […]

Published By: HashtagU Telugu Desk
Vettaiyan

Vettaiyan

టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 170వ సినిమా వెట్టియాన్. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు తాజాగా అనౌన్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join
అయితే కచ్చితమైన డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. అక్టోబర్ లో రెండు పండగలు ఉన్నాయి. అక్టోబర్ స్టార్టింగ్ లో దసరా ఉంటే చివరి రోజులో దీవాళీ ఉంది. ఈ రెండు పండగల్లో రజినీకాంత్ ఎప్పుడు రాబోతున్నారో అన్నది తెలియాల్సి ఉంది. కాగా దసరాకి వచ్చేందుకు ఎన్టీఆర్ దేవర డేట్ ఫిక్స్ చేసుకొని కూర్చొంది. ఇక దీవాళీ పండక్కి వచ్చేందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అలాగే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో దేవర అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ నిర్మాత దిల్ రాజు డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

Also Read: Siri Hanumanth: సిరి హనుమంతు లేటెస్ట్ లుక్స్ పై భారీగా ట్రోల్స్.. కంటికి ఆపరేషన్ చేయించుకున్నావా అంటూ!

మరి ఈ రెండు పండగల్లో రజినీకాంత్ ఏ పండక్కి వస్తారో? చూడాలి మరీ. అలాగే చరణ్, ఎన్టీఆర్ లో ఎవరి మీద ఎటాక్ కి సిద్దమవుతున్నారో అంటే మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి. అయితే ఇప్పటికే రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరీ అక్టోబర్ లో దసరా బరిలో ఎవరు దిగుతారో, ఎవరు గెలుస్తారో చూడాలి మరీ.

Also Read: RC 16: రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్.. ఏ సినిమాలో అంటే?

  Last Updated: 07 Apr 2024, 09:51 PM IST