Rajendra Prasad : భారదేశం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు పలు రంగాల్లో తమ ప్రతిభను చూపించిన వారికి ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది సీనియర్స్, ఎంతో మంది ప్రతిభ చూపినా పలు రంగాల్లో పలువురికి పద్మ అవార్డులు దక్కవు. అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు పద్మ అవార్డులపై మాట్లాడుతూ ఉంటారు. తాజాగా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ పద్మ అవార్డుల గురించి మాట్లాడారు.
ఎన్నో సినిమాల్లో హీరోగా తన కామెడీతో మెప్పించిన రాజేంద్రప్రసాద్ మధ్య మధ్యలో తన ఎమోషనల్ సినిమాలతో ఏడిపించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. త్వరలో నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో రాబోతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడగా ఆయనకు పద్మశ్రీ ఎందుకు రాలేదు అని ప్రశ్న ఎదురైంది.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డులు రాజకీయాలతో ముడి పడి ఉన్నాయి. మనం వెళ్లి ఎవర్నో అడగాలి. లేదా రాజకీయాలు చేయాలి. మనకు ఆ రెండూ రావు. నాకు ఆ అవార్డు రానందుకు బాధేం లేదు. ఓ సారి రామోజీ రావు గారు నన్ను.. నీకు పద్మశ్రీ వచ్చిందా అని అడిగారు. నేను రాలేదు అని చెప్తే.. దాని కోసం ప్రయత్నించకు. నువ్వు అందరి ఇళ్లలోనూ ఉన్నావు. అది నీకు పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు అని అన్నారు. నేను పద్మశ్రీ గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు అది రావాలంటే రాజకీయాల్లో పరిచయాలు ఉండాలి అని అన్నారు. దీంతో రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Samantha : నాగ చైతన్యతో మొదటి సినిమా.. ‘ఏ మాయ చేసావే’ గురించి మాట్లాడిన సమంత..