Site icon HashtagU Telugu

Game Changer : శంకర్‌కి దొరికిన గొప్ప నిధి రామ్ చరణ్.. రాజీవ్ కనకాల కామెంట్స్..

Ram Charan, Game Changer

Ram Charan, Game Changer

Game Changer : తమిళ్ దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల శంకర్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘ఇండియన్ 2’ ఆశించిన స్థాయిలో అలరించలేక బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. దీంతో గేమ్ ఛేంజర్ పై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి ఆ సినిమాలో నటించిన రాజీవ్ కనకాలని ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన జవాబు నెట్టింట వైరల్ గా మారింది.

రీసెంట్ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడుతూ.. “ఇండియన్ 2 కథ వేరు, గేమ్ ఛేంజర్ కథ వేరు. కథలో డ్రామాతో పాటు పూర్తీ కమర్షియల్ గా సినిమా ఉంటుంది. ఇక పాటలు విషయానికి వస్తే, ఒక్కో పాటని 10-12 కోట్ల ఖర్చుతో తీశారు. మేము అయితే మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాకి ఉన్న మరో పెద్ద ప్లస్ ఏంటంటే రామ్ చరణ్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా రైసింగ్‌లో ఉన్నారు. ఆయన ఉంటే చాలు కాసులు వర్షం కురుస్తుంది. శంకర్ గారికి దొరికిన ఒక గొప్ప నిధి రామ్ చరణ్” అంటూ చెప్పుకొచ్చారు. రాజీవ్ చేసిన ఈ కామెంట్స్ తో మూవీ పై మరిన్ని అంచనాలు కలుగుతున్నాయి.

కాగా ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ కి సంబంధిచిన చిత్రీకరణ అంతా పూర్తీ అయ్యింది. మూవీలోని మరికొన్ని ముఖ్య పాత్రలు పై చిత్రీకరించాల్సిన షూటింగ్ మరో పదిహేను రోజులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం శంకర్ ఆ చిత్రీకరణ పనిలోనే ఉన్నారు.