చిత్రసీమలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala) కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలో నటిస్తున్నాడంటే ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని భావిస్తుంటారు. అలాగే రాజీవ్ కు ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమాలో ఆయన పాత్ర చనిపోవడం..అది సినిమా హిట్ కు కేరాఫ్ గా మారడం జరుగుతుంటుంది. దీంతో సినిమాలో ఆయన పాత్ర చనిపోయిందంటే..ఇక సినిమా హిట్ అని నమ్ముతుంటారు. తాజాగా గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం రివర్స్ అయ్యింది. ఆయన సెంటిమెంట్ కు బ్రేక్ పడింది.
Formula E Race : కేటీఆర్ పై దానం ఆసక్తికర వ్యాఖ్యలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ (Game Changer ) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటుతాడని అంత ఊహించారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు. శంకర్ డైరెక్షన్ , దిల్ రాజు నిర్మాణం అనగానే సినిమా పై హై రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథలో కొత్తదనం లేకపోవడం , సాంగ్స్ పెద్దగా బాగుండకపోవడం , సాగదీత సన్నివేశాలు ఇలా ప్రతిదీ బోర్ కొట్టించాయి.
ఇక గేమ్ చేంజర్ టీజర్, ట్రైలర్‌లో రాజీవ్ కనకాల కనిపించినప్పుడు.. ఆ పాత్ర కూడా మధ్యలోనే ఖతం అని అంతా ఫిక్స్ అవుతూ సినిమా హిట్ అయినట్లే అని ఫిక్స్ అయ్యారు. జనాలు ఊహించినట్టుగానే రాజీవ్ కనకాల పాత్ర మధ్యలోనే చనిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ పది నిమిషాల పాటు రాజీవ్ కనకాల కనిపిస్తాడేమో. ఇక రాజీవ్ కనకాల చనిపోవడంతో సినిమా హిట్ అని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ గేమ్ ఛేంజర్‌కు పెద్ద ఎత్తున ప్లాప్ టాక్ వస్తుంది. ఈ ట్రోలింగ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యేలా కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి శంకర్ – రామ్ చరణ్ కలయిక అనగానే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..కానీ శంకర్ మాత్రం నిరాశ కు గురి చేసాడు.
