Site icon HashtagU Telugu

Rajasekhar : ఫాదర్ రోల్ లో రాజశేఖర్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..?

Rajasekhar New Movie title as Magadu

Rajasekhar New Movie title as Magadu

Rajasekhar ఒకప్పుడు తన సినిమాలతో అలరించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయారని చెప్పొచ్చు. సీనియర్ హీరోల్లో తనకంటూ ఒక మార్క్ ఉన్నా కూడా ఆయన ఎందుకో రాణించలేకపోతున్నారు. చేసేది లేక ఇప్పుడు సైడ్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు రాజశేఖర్. రాజశేఖర్ లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన్ను ఎవరు పట్టించుకోలేదు.

ఇక లేటెస్ట్ గా మరో యువ హీరో సినిమాలో ఫాదర్ రోల్ చేస్తున్నారట రాజశేఖర్. యంగ్ హీరో శర్వానంద్ హీరోగా లూజర్ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో రాజశేఖర్ ఫాదర్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుని. ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శర్వానంద్ మనమే సినిమా చేస్తున్నాడు. శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే, జూన్ లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. శర్వాంద్ 36 సినిమాలో రాజశేఖర్ నటించడం. అది కూడా శర్వా ఫాదర్ రోల్ లో కనిపించడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మరి ఈ సినిమా రాజశేఖర్ కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి.

Also Read : Mahesh Babu : మహేష్ న్యూ లుక్.. పిచ్చెక్కిస్తున్నాడుగా..?