Site icon HashtagU Telugu

Allari Priyudu : ‘అల్లరి ప్రియుడు’ చేయనన్న రాజశేఖర్.. కానీ దర్శకేంద్రుడు..

Rajasekhar Regected Allari Priyudu Movie first the Raghavendra rao Convincing him Story Behind Allari Priyudu

Rajasekhar Regected Allari Priyudu Movie first the Raghavendra rao Convincing him Story Behind Allari Priyudu

అంకుశం, ఆహుతి వంటి సినిమాలతో యాంగ్రీ మెన్ గా మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రాజశేఖర్(Rajasekhar).. లవర్ బాయ్ గా కనిపిస్తూ చేసిన సినిమా ‘అల్లరి ప్రియుడు'(Allari Priyudu). దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు(Raghavendra Rao) ఈ సినిమాని తెరకెక్కించారు. మ్యూజికల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మధుబాల హీరోయిన్స్ గా నటించారు. తన కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రాన్ని రాజశేఖర్.. మొదట చేయడానికి నిరాకరించారట. అయన మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని చాలా మంది.. రాఘవేంద్రుడికి రాజశేఖర్ తో ఆ సినిమా వద్దని చెప్పారట. కానీ ఆయన వినలేదు. ఇంతకీ అసలు ఏమైంది..?

అల్లరి ప్రియుడు మూవీ ముందు వరకు రాజశేఖర్ యాంగ్రీ మెన్ ఇమేజ్ కి తగ్గటే సినిమాలు చేస్తూ వచ్చారు. రాఘవేంద్రరావు ‘అల్లరి ప్రియుడు’ స్టోరీ చెప్పగానే రాజశేఖర్ ఇలా అన్నారట.. “ఇప్పటి వరకు మాస్ ఇమేజ్ లో చూసిన నన్ను కంప్లీట్ లవర్ బాయ్ గా ఆడియన్స్ అంగీకరిస్తారా. రిస్క్ ఎందుకులే సార్” అని చెప్పి నటించడానికి నిరాకరించారట. ఆయన తరువాత ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తులు కూడా రాఘవేంద్రరావుకి ఇదే మాట చెప్పారట. కానీ రాఘవేంద్రరావు ఆ సినిమాని రాజశేఖర్ తోనే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఫైనల్ గా తన మాటనే నెగ్గించుకొని రాజశేఖర్ తో అల్లరి ప్రియుడు తెరకెక్కించారు.

ఇక ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలోని అన్ని పాటలని చిత్ర, బాలసుబ్రమణ్యం కలిసి పాడారు. ఇక ఈ పాటల్లో ‘రోజ్ రోజ్ రోజాపువ్వా’ అని సాగే పాట అప్పటిలో మోత మోగిపోయింది. ప్రతి ఈవెంట్ లో ఈ పాటే వినిపించేది. ఇప్పటికి కూడా రాజశేఖర్ అనగానే చాలామందికి ఆ పాటే గుర్తుకు వస్తుంది. ఇక ఈ సినిమాలోని పాటలకి రాజశేఖర్ డాన్స్ వేయడానికి చాలా కష్టపడ్డారట. ఇక ఈ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.

 

Also Read : Mahesh Babu : ఇంగ్లీష్ లెటర్స్‌లో.. ఆల్మోస్ట్ అన్ని అక్షరాలపై యాడ్స్ చేసేసిన మహేష్.. రికార్డ్ సెట్..