ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ఈమధ్య ఏమాత్రం ఫాం లో లేడని తెలిసిందే. గరుడవేగ సినిమాతో ఆమధ్య సక్సెస్ అందుకున్నా ఆ తర్వాత ఆ సక్సెస్ మేనియా కొనసాగించలేదు. కల్కి తర్వాత రాజశేఖర్ (Rajasekhar) సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈమధ్య విలన్ గా, సపోర్టింగ్ రోల్ లో కూడా రాజశేఖర్ నటించడానికి సిద్ధమయ్యారు.
ఐతే లేటెస్ట్ గా రాజశేఖర్ ఫ్యాన్స్ కోసం ఒక సూపర్ న్యూస్ వచ్చింది. రాజశేఖర్ ఒక కొత్త సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని డైరెక్షన్ లో రాజశేఖర్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా మగాడు (Magadu) అని పెట్టినట్టు టాక్. ఆల్రెడీ రాజశేఖర్ మగాడు టైటిల్ తో అంతకుముందు సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన సినిమాకే ఆ టైటిల్ వాడుతున్నారు.
ప్రేమ ఇష్క్ కాదల్ తో డైరెక్టర్ గా పరిచయమైన పవన్ సాధినేని నారా రోహిత్ (Nara Rohith) తో కూడా ఒక సినిమా చేశాడు. ఈమధ్య డిస్నీ హాట్ స్టర్ కోసం వెబ్ సీరీస్ లను చేస్తున్నాడు. ఐతే ఈమధ్యనే స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ తో పవన్ సాధినేని (Pawan Sadhineni) సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈలోగా రాజశేఖర్ తో చేస్తున్న మగాడు సినిమా పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు.
రాజశేఖర్ కూడ తిరిగి ఫాం లోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ మగాడు సినిమాతో అయినా ఆయన ప్రయత్నం ఫలిస్తుందా అన్నది చూడాలి. ఐతే సూపర్ హిట్ టైటిల్ పెడుతున్నారు కాబట్టి కథ కథనాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు సంబందించి మరిన్ని డీటైల్స్ త్వరలో రానున్నాయి.
Also Read : Saripoda Shanivaram Premier Show Talk : నాని సరిపోదా శనివారం ప్రీమియర్స్ టాక్..!