ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి హారర్ కామెడీ జోనర్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను (Mixed Talk) మూటగట్టుకున్నప్పటికీ, ప్రభాస్ క్రేజ్ కారణంగా వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు రూ.139.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రభావం బలంగా ఉండటం కలెక్షన్లకు కలిసొచ్చింది.
Raajasaabh Ticket
రెండో వీకెండ్‌లో కూడా ఈ సినిమా నిలకడగా రాణిస్తోంది. ఆదివారం (10వ రోజు) ఈ చిత్రం దేశవ్యాప్తంగా దాదాపు రూ.2.50 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు అంచనా. కేవలం సౌత్ మార్కెట్లోనే కాకుండా, హిందీ బెల్ట్‌లో కూడా ప్రభాస్ అభిమానులు సినిమాను ఆదరిస్తుండటం విశేషం. అయితే, మిక్స్డ్ టాక్ కారణంగా వీక్ డేస్‌లో వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినా, వీకెండ్స్‌లో మాత్రం థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్ మరియు మారుతి కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రపంచవ్యాప్త వసూళ్ల విషయానికి వస్తే, ‘రాజాసాబ్’ 10 రోజుల్లోనే రూ.180 కోట్ల నెట్ మార్కును దాటినట్లు సినీ వర్గాల సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ రూ.200 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ కావాలంటే మరిన్ని వసూళ్లను సాధించాల్సి ఉంది. చూద్దాం మరి ఏంజరుగుతుందో !!
