Site icon HashtagU Telugu

Rajanala : చెడు అలవాటు కోసం రాజనాల చేసిన పని.. ఒక మంచి కార్యానికి దారి తీసింది..

Rajanala Kaleswara Rao Bad Habit lead to Good reason in Film Industry

Rajanala Kaleswara Rao Bad Habit lead to Good reason in Film Industry

టాలీవుడ్(Tollywood) విలన్స్(Villains) లో తనదైన ముద్ర వేసి ప్రతినాయకుడి పాత్రకు కూడా అభిమానులు ఉండేలా చేసిన నటుడు ‘రాజనాల’. ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR) వంటి స్టార్ హీరోలను ఢీ కొట్టాలి అంటే ఎదురుగా రాజనాల కాళేశ్వరరావు(Rajanala Kaleswara Rao) ఉండాలి అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా రాజనాల చేసుకున్నారు. ఈక్రమంలోనే ఈ ఇద్దరి అగ్రహీరోలకు సంబంధించిన చాలా సినిమాల్లో రాజనాల విలన్ గా కనిపించేవారు. అయితే రాజనాల తనకు ఉన్న చెడు అలవాటు సిగరెట్(cigarette) కోసం చేసిన ఒక పని.. సినీ ఇండస్ట్రీలో ఒక మంచి కార్యానికి దారి తీసింది.

అప్పటిలో సినీ పరిశ్రమలో చాలామంది సిగరెట్లు కాల్చేవారు. నటులు, దర్శకులు, రచయితలకు.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరికి ఈ అలవాటు ఉండేది. దీంతో అప్పటి నిర్మాణ సంస్థలు మర్యాద కోసం టీ, కాఫీలు ఇచ్చినట్లు సిగరెట్లు కూడా ఇచ్చేవారు. ఈక్రమంలోనే పలానా దర్శకుడు, నటుడు ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతాడు అని తెలుసుకొని, వారు రావడానికంటే ముందే వారి టేబుల్ పై ఆ సిగరెట్ పెట్టి, అగ్గిపెట్టి ఉంచేవారట అప్పట్లో. ఇక రాజనాలకు కూడా ఈ అలవాటు ఉండడంతో ఆయన వచ్చే ముందే ఇవి టేబుల్ పై ఏర్పాటు చేసి పెట్టేవారు. అయితే రాజలక్ష్మి నిర్మాణ సంస్థలో రాజనాల ఒక సినిమా చేస్తున్న సమయంలో సిగరెట్ రావడం లేట్ అయ్యింది.

దీంతో రాజనాల కోపం తెచ్చుకొని సిగరెట్ వస్తేనే మేకప్ వేసుకుంటా అని పట్టుబట్టి కూర్చున్నారు. ఇంతలో షాట్ మొదలైంది, రాజనాల షూటింగ్ కి రాకపోవడంతో నిర్మాత ఏమైందని మేకప్ మ్యాన్ ని ప్రశ్నించాడు. మేకప్ మ్యాన్ జరిగిన విషయం చెప్పాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నిర్మాతకు ఒళ్ళు మండింది. సిగరెట్ ఇవ్వడం కచ్చితమైన రూల్ కాదు, ఏదో మర్యాదకు ఇస్తున్నాము. ఇక నుంచి ఈ సంస్థలో సిగరెట్లు ఇచ్చేది లేదు. రాజనాల షూటింగ్ కి వస్తారో, రారో..? ఇక ఆయన్నే నిర్ణయించుకోమని నిర్మాత కుండా బద్దలుకొట్టేశారు. ఇలా రాజలక్ష్మి బ్యానర్ మొదటిసారి సిగరెట్లు ఇవ్వడం మానేసింది. ఆ తరువాత ఒక్కో నిర్మాణ సంస్థ ఇవ్వడం మానేయడంతో ఆ చెడు అలవాటుని నిర్మాతలు ప్రోత్సహించడం అనే పద్దతికి ముగింపు పడింది.