Site icon HashtagU Telugu

Dasara nani movie: దసరా సినిమాకు ఫిదా అయిన రాజమౌళి.. ఏకంగా కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటూ?

Nani Rajamouli

Nani Rajamouli

Dasara nani movie: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దసరా సినిమాని చూసి ఫిదా అయ్యాడు. నాచురల్ స్టార్ హీరో నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి మార్కులు వచ్చి పడుతున్నాయి. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడిగా పరిచయమయ్యాడు. శ్రీకాంత్ కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా మంచి అనుభవమున్న దర్శకుడిగా సినిమాను రూపొందించాడు. దీంతో ఈ కొత్త దర్శకుడు దర్శకత్వంని చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు.

ఈ సినిమా మంచి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నాని, కీర్తి సురేష్ కూడా ఊర మాస్ లుక్ లో అద్భుతంగా నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను మహేష్ బాబు, ప్రభాస్ చూడగా ఈ సినిమాను ప్రశంసలతో ముంచారు. ఇది ఒక స్టన్నింగ్ సినిమా అంటూ.. సినిమా పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నాను అని మహేష్ బాబు అనగా.. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి అంటూ ప్రభాస్ అన్నాడు.

అయితే తాజాగా రాజమౌళి కూడా ఈ సినిమాను పొగడ్తలతో ముంచాడు. రగ్డ్ ల్యాండ్ స్కేప్, రా క్యారెక్టర్ల నడుమ.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి సన్నివేశాన్ని ప్రేమ కథని ఎంతో హృద్యంగా, అద్భుతంగా తెరకెక్కించాడు అని అన్నాడు. కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ తో నాని అదరగొట్టాడు అంటూ.. ఇక కీర్తి సురేష్ ఎప్పటిలాగే తన పాత్రలో మునిగిపోయింది అని అన్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందంటూ.. నటీనటులందరూ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని.. ఇంతటి గొప్ప విజయం అందుకున్న ఈ సినిమా బృందానికి ప్రత్యేక శుభాభివందనాలు అంటూ ప్రశంసలు కురిపించాడు

Exit mobile version