Site icon HashtagU Telugu

Salaar First Ticket : ‘సలార్’ ఫస్ట్ టికెట్ దక్కించుకున్న రాజమౌళి

Salaar First Ticket

Salaar First Ticket

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) – KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ (Salaar). శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ 22 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో మేకర్స్ సినిమా తాలూకా ప్రమోషన్ ను మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ (Salaar Advance Booking) ఓపెన్ చేయగా..మొదటి టిక్కెట్ ను దర్శక ధీరుడు రాజమౌళి (SS rajamouli) దక్కించుకున్నారు. ‘సలార్’ చిత్రాన్ని నైజాంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ అధినేత నవీన్ ఎర్నేని ఈ ‘సలార్’ తొలి టికెట్టును రాజమౌళికి అందజేశారు. ఇదిలా ఉంటె ‘సలార్’ కోసం ప్రభాస్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ బయటకు రావడం ఇదే మొదటిసారి. త్వరలో దీనిని విడుదల చేయనున్నారు. మరి ఇంటర్వ్యూ లో రాజమౌళి..ప్రభాస్ ను ఏ ఏ ప్రశ్నలు వేసారో చూడాలి.

Read Also : Medigadda Barrage : మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు – ఎల్‌అండ్‌టీ లేఖ