Site icon HashtagU Telugu

Rajamouli : తమిళనాడు ట్రిప్.. అక్కడి దేవాలయాలు, ఫుడ్‌ని పొగుడుతూ రాజమౌళి స్పెషల్ ట్వీట్..

SS Rajamouli

Rajamouli went to Thamilanadu Trip and posted about temples and food in Thamilanadu

రాజమౌళి(Rajamouli) బాహుబలి(Bahubali)తో తెలుగు సినిమాని ఇండియా(India) స్థాయికి తీసుకెళ్తే, ఈసారి RRR సినిమాతో ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఏకంగా ఆస్కార్ అవార్డు(Oscar Award) సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు రాజమౌళి. RRR సినిమా, రిలీజ్, హాలీవుడ్ ప్రమోషన్స్.. ఇలా చాలా రోజులు తీరిక లేకుండా గడిపారు రాజమౌళి. త్వరలో మహేష్ బాబు(Mahesh Babu) సినిమా వర్క్ ని మొదలుపెట్టనున్నారు. అయితే ఈ గ్యాప్ లో సరదాగా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లొచ్చారు రాజమౌళి.

రాజమౌళి తన భార్య, కొడుకు, కోడలు. కూతురు.. మరికొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి తమిళనాడు(Thamilanadu) ట్రిప్ కి వెళ్లారు. తమిళనాడులో బీచ్‌లు, రిసార్ట్‌లు, దేవాలయాలు తిరిగారు. ఇటీవలే రాజమౌళి తమిళనాడు ట్రిప్ నుంచి తిరిగి రాగా తమిళనాడు దేవాలయాలు, ఫుడ్‌పై స్పెషల్ ట్వీట్ చేశాడు జక్కన్న.

రాజమౌళి తమిళనాడు దేవాలయాల వద్ద దిగిన ఫోటోలని వీడియో రూపంలో షేర్ చేస్తూ.. చాలా కాలంగా తమిళనాడుకు వెళ్దాం అనుకుంటున్నాను. తమిళనాడు దేవాలయాలను సందర్శించాలని నా కూతురు ఆలోచనలతో ఇది జరిగింది. జూన్ చివరి వారంలో మేము తమిళనాడు ట్రిప్‌కి వెళ్ళాము. శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మధురై వెళ్ళాను. అక్కడ ప్రతి దేవాలయంలో అద్భుతమైన వాస్తు, శిల్పాలు, ఇంజినీర్ల పనితనం కనిపించింది. పాండ్యులు, చోళులు, నాయకర్లు.. అనేక ఇతర తమిళనాడుని పాలించిన రాజులు వారి ఆధ్యాత్మికమైన ఆలోచనలు నన్ను మంత్రముగ్ధుడిని చేశాయి. మంత్రకూడం, కుంభకోణం, రామేశ్వరంలో చక్కటి భోజనం చేశాను. అన్ని చోట్ల ఫుడ్ చాలా బాగుంది. ఈ ట్రిప్ లో నేను దాదాపు 3 కిలోల బరువు పెరిగాను. ఇన్ని రోజుల విదేశీ ప్రయాణాల తర్వాత తమిళనాడు ట్రిప్ నాకు ఒక హోమ్ టూర్‌లా అనిపించింది. నా మైండ్ చాలా రిఫ్రెష్ అయింది అని పోస్ట్ చేశాడు రాజమౌళి. దీంతో జక్కన్న తమిళనాడుని ఈ రేంజ్ లో పొగుడుతూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

 

Alsoo Read : Rajamouli: మహేష్ బాబు మూవీ తర్వాత రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ “మహాభారతం”..! క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌..!