Site icon HashtagU Telugu

Baahubali : బాహుబలి కథ పక్కన పెట్టి.. ప్రభాస్‌తో బాక్సింగ్ స్టోరీ చేయాలనుకున్న రాజమౌళి..

Rajamouli wants to do boxing movie with prabhas in place of Bahuballi due to budget issues

Rajamouli wants to do boxing movie with prabhas in place of Bahuballi due to budget issues

బాహుబలి(Baahubali) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమా దారిని పూర్తిగా మార్చేసిన చిత్రం. అక్కడ మొదలైన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎదుగుదల RRR తో ఆస్కార్ వరకు చేరుకుంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పైనే అయిపొయింది. కానీ ఇప్పటికి కూడా ఏదొక ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ పై బాహుబలి కనిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక సమస్య రావడంతో.. బాహుబలి స్టోరీని పక్కన పెట్టేసి ఒక బాక్సింగ్ స్టోరీని చేయాలని రాజమౌళి(Rajamouli) డిసైడ్ అయ్యాడట.

బాహుబలిని ముందుగా ఒక పార్ట్ గానే చేయాలనుకున్నారు. కానీ కథలోని ఎమోషన్స్ రాయడం మొదలు పెట్టిన తరువాత ప్రతి పాత్రని లోతుగా చూపించాల్సి వచ్చింది. దీంతో కథని రెండు భాగాలుగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. ఇక ఆ తరువాత మళ్ళీ బడ్జెట్ లెక్కలు వేయగా అప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏ సినిమాకి పెట్టని బడ్జెట్ వచ్చింది. దీంతో రాజమౌళి కంగు తిన్నాడు. ఏదైనా తేడా కొడితే నిర్మాత లైఫ్ రిస్క్ లో పడుతుంది అని భావించాడు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డకు తెలియజేశాడు.

‘ఈ కథ పక్కన పెట్టి, నా దగ్గర ఒక మంచి బాక్సింగ్ స్టోరీ ఉంది. అది చేద్దాం. ప్రభాస్ కి నేను చెబుతాను. తను నా మాట వింటాడు’ అని నిర్మాతకు చెప్పాడట. కానీ శోభు యార్లగడ్డ(Shobhu Yarlagadda).. రాజమౌళిని గట్టిగా నమ్మాడు. ‘నువ్వేమి ఆలోచించకు. ఇదే కథతో మనం ముందుకు వెళ్దాం. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేద్దాం’ అని రాజమౌళికి ధైర్యం చెప్పి బాహుబలిని ముందుకు తీసుకు వెళ్ళాడట. ఈ విషయాన్ని ఒక అవార్డు ఫంక్షన్ లో ప్రభాస్(Prabhas) స్వయంగా చెప్పాడు. ‘బాహుబలి కోసం రాజమౌళి, మేము ఎంత కష్టపడినా, ఈ నిర్మాతలు లేకుంటే అసలు ఆ చిత్రమే ఉండేది కాదని’ వెల్లడించాడు.