Site icon HashtagU Telugu

Baahubali : బాహుబలి సినిమాలో ప్రభాస్‌కి తోడుగా ఒక కోతి నటించాలంటా.. కానీ..!

Rajamouli wants to add a Monkey Character in Baahubali for Shivudu Character But it Couldn't Happen

Rajamouli wants to add a Monkey Character in Baahubali for Shivudu Character But it Couldn't Happen

బాహుబలి(Baahubali) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమా దారిని పూర్తిగా మార్చేసిన చిత్రం. అక్కడ మొదలైన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎదుగుదల RRR తో ఆస్కార్ వరకు చేరుకుంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పైనే అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఏదొక ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ పై బాహుబలి కనిపిస్తూనే ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్(Prabhas).. బాహుబలి, శివుడు అనే రెండు పాత్రల్లో కనిపించారు. శివుడు పాత్ర పక్కన ఒక కోతి(Monkey) కూడా నటించాల్సిందట..? అసలు ముందు అనుకున్న కథ ఏంటో తెలుసా..?

బాహుబలి కథ విషయంలో చాలా మార్పులే జరిగాయి. అలా జరిగిన ఒక మార్పే.. శివుడు, కోతి కాంబినేషన్ సీన్స్. శివుడు పాత్రతో ఒక కోతి కూడా సినిమాలో కనిపించేలా రాజమౌళి కథని రాసుకున్నారు. ఆ కోతి వల్లే సినిమా కథ కూడా ముందుకు సాగుతుంది. మనం చూసిన సినిమాలో జలపాతం నుంచి అవంతిక (తమన్నా) మాస్క్ కింద పడడం, అది తీసుకున్న శివుడు ఇసుకలో ఆమె రూపం చెక్కడం, ఆ రూపం ఊహతో పైకి వెళ్లడం జరుగుతుంది. అయితే అసలు రాజమౌళి రాసుకున్న మొదటి స్క్రీన్ ప్లే ఏంటో తెలుసా..?

మొదటిలో శివుడు జలపాతం దగ్గర కొమ్మను పట్టుకునేందుకు దూకి విఫలం అవుతాడు. అప్పుడు అతడితో పాటు కోతి కూడా ప్రయత్నించగా.. ఆ కోతి కొమ్మ అందుకొని పైకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లిన కోతి కొన్ని రోజులు తరువాత కొన్ని నగలతో కిందకి వస్తుంది. అలా కోతి తెచ్చిన నగలతో ప్రభాస్ అవంతిక రూపాన్ని చెక్కుతాడు. ఇలా సీన్ రాసుకున్నారు రాజమౌళి. అయితే కోతిని సీజేలో చూపిస్తే కొన్ని సన్నివేశాల్లో న్యాచురల్ గా కనిపించదని నిజమైన కోతిని పెట్టాలని రాజమౌళి భావించారు. దీంతో అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్న ఒక నిజమైన కోతిని బాహుబలి కోసం రాజమౌళి బుక్ చేశారట. నిజమైన కోతిని పెట్టి తీయడానికి నిబంధనలకు విరుద్ధం అవ్వడంతో సీజేలో పెట్టి షూట్‌ చేయడానికి రాజమౌళికి ఇష్టం లేదు. దీంతో చేసేది లేక కోతి స్క్రీన్ ప్లే మార్చి రాసుకున్నారు.

 

Also Read : Mahesh Babu : తండ్రి జ్ఞాపకార్థం మరో కొత్త సేవా కార్యక్రమం మొదలుపెట్టిన మహేష్ బాబు..