Rajamouli: రూ.90 లతో అయిపోయే దానికోసం 250 కోట్లు ఖర్చు చేయించిన జక్కన్న?

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 08:20 AM IST

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి. కాగా ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అంతేకాకుండా ఒకదాన్ని మించి ఒకటి రికార్డుల మోత మోగించాయి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు జక్కన్న. ఇకపోతే రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తాను అనుకున్న అవుట్పుట్ కోసం ఎంత కష్టపడడానికైనా ఆయన వెనుకాడరు.

అలాగే ఈ విషయంలో నటీనటులు ఇబ్బంది పడిన సరే ఆయన మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు కోసం ఏకంగా ఏడాది పాటు సమయం తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలో బాహుబలి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఆయన క్రేజ్ ని పెంచడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ లో చాటి చెప్పింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ కోసం రాజమౌళి నిర్మాతల చేత ఏకంగా నాలుగు వందల కోట్లు ఖర్చు చేయించాడు. మొదటి భాగానికి 150 కోట్లు, రెండో భాగానికి 250 కోట్లు అయి ఉంటుంది. కానీ ఈ మూవీ మొదటి భాగం ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేస్తే, రెండో భాగం 1800 కోట్లు వసూలు చేసింది ఇండియన్‌ సినిమా లెక్కలను తిరగరాసింది.

 

అయితే ఇందులో భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా ఒక సీన్‌లో భారీ బుల్‌తో ఫైట్‌ చేస్తాడు. దీనికోసం రానా చాలా శ్రమిస్తాడు. అంతేకాదు దీన్ని మామూలుగా చేసి గ్రాఫిక్స్ చేశారు. అలా గ్రాఫిక్స్ కే వందల కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే ఇలాంటి సన్నివేశం రియల్‌ లైఫ్‌లో చోటు చేసుకుంది. అది ఇప్పుడు వైరల్‌ ఒక మద్యం ప్రియుడు ఫుల్లుగా మద్యం తీసుకుని రోడ్డుపై ఎద్దుతో ఫైట్‌ చేస్తున్నాడు. సింపుల్‌గా దానితో పోరాడి ఎట్టకేలకు దాన్ని కింద పడేశాడు. ఇందులో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. కేవలం 90తో అయిపోయేది, అనవసరం రాజమౌళి 250 కోట్లు ఖర్చు చేశాడంటూ రచ్చ చేస్తున్నారు. అతను 90 వేసి బుల్‌ ని పడేశాడు, రాజమౌళికి ఆ చిన్న లాజిక్‌ తెలియక కోట్లు ఖర్చు చేయించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.