Site icon HashtagU Telugu

Rajamouli Speech @ Pushpa 2 Pre Release : పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతం – రాజమౌళి

Rajamouli Speech Pushap 2

Rajamouli Speech Pushap 2

పుష్ప 2 ..పుష్ప 2 ..పుష్ప 2 (Pushpa 2)ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు మారుమోగిపోతుంది. రెండేళ్లు గా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. ఇప్పటికే మూవీ పై అంచనాలు తారాస్థాయికి చేరగా..వాటిని ఇంకాస్త పైకి తీసుకెళ్తున్నారు మేకర్స్ & ఇతర దర్శకులు. తాజాగా రిలీజ్ అయినా సాంగ్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి సూపర్బ్ గా ఉండడం తో సినిమాలో ఇంకా ఏ రేజ్ లో ఉంటాయో..సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..అల్లు అర్జున్ (Allu Arjun) ఏ రేంజ్ లో చించేసాడో అని ఆరాటపడుతున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో వైల్డ్ జాతర పేరుతో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pushpa 2 Pre Release Event) ను ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాజమౌళి (Rajamouli) హాజరయ్యారు. అలాగే చిత్రయూనిట్ , పలువురు దర్శక , నిర్మాతలు తదితరులు హాజరై సందడి చేసారు. ఇక ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ..” పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాను. అప్పుడు చెప్పాను బన్నీ తో.. నార్త్ ఆడియన్స్ ని అస్సలు వదలద్దు అని, నాడు బన్నీకి నేను చెప్పిన మాటలను..బన్నీ కచ్చితంగా పాటించాడు. ఇక ఇప్పుడు పుష్ప -2 కి అక్కడ ప్రమోషన్స్ అవసరం లేదు. అంతలా భారీగా పాపులారిటీ దక్కించుకున్నారు. నార్త్ ఆడియన్స్ ని పట్టుకున్నామంటే ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదు. అంతలా అక్కడ హైప్ ఇచ్చేయొచ్చు. బన్నీ కచ్చితంగా అదే ఫాలో అయ్యాడు.

ఇక నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పక్కనే పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లి, కాసేపు అల్లు అర్జున్, సుకుమార్ లతో చిట్ చాట్ చేశాను. ఆ తర్వాత ఇంట్రడక్షన్ సీన్ నాకు చూపించారు. ఇక సుకుమార్ టాలెంట్ కి దేవిశ్రీప్రసాద్ ఎంతయితే మ్యూజిక్ అందించాలో అంతా ఇచ్చేశాడు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ కచ్చితంగా ఇక్కడ మనకు వచ్చింది. ఇక ఇంట్రడక్షన్ పార్టే ఇలా ఉందంటే ఇక మిగతా పార్ట్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్” అంటూ చెప్పుకొచ్చారు.

రాజమౌళి అభిప్రాయాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి. పుష్పరాజ్ పాత్రకు ఉన్న విశిష్టతను ఆయన వ్యాఖ్యలు మరింత హైలైట్ చేశాయి. సుకుమార్, అల్లు అర్జున్‌లు రాజమౌళి రియాక్షన్‌ను చర్చించుకోవడం ఈ సీన్‌కు ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిచ్చింది. డిసెంబర్ 4న సాయంత్రం పుష్ప 2 బ్రాండ్ ప్రపంచానికి అర్థమవుతుందని ఆయన చెప్పడం, ప్రేక్షకుల్లో మరింత ఉత్సహాన్ని రేకెత్తిస్తోంది.

Read Also : Health Festival : ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్