Rajamouli : బాహుబలి 1 తరువాత రాజమౌళి.. ఫహద్ ఫాజిల్ తండ్రిని కలిసి చేసిన పని.. వారిని షాక్‌కి..

రాజమౌళి బాహుబలి 1 తరువాత చేసిన ఓ పని మలయాళ ఇండస్ట్రీ వ్యక్తులను ఆశ్చర్యపరిచింది.

Published By: HashtagU Telugu Desk
Rajamouli

Rajamouli

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli).. బాహుబలి(Bahubali) వంటి గొప్ప సినిమా తెరకెక్కించి ఇండియా వైడ్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచారు. బాహుబలి 1 తరువాత నేషనల్ వైడ్ రాజమౌళి పేరు ఎంతలా వినిపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత బాహుబలి 2, RRR సినిమాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ చైర్ ని రాజమౌళి సొంతం చేసుకున్నారు. కానీ ఎంత స్టార్‌డమ్ వచ్చినా.. రాజమౌళి మాత్రం ఒదిగే ఉన్నారు.

తన సింప్లిసిటీతో రాజమౌళి మరింత స్టార్‌డమ్ ని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తిత్వంతోనే రాజమౌళి బాహుబలి 1 తరువాత చేసిన ఓ పని మలయాళ ఇండస్ట్రీ వ్యక్తులను ఆశ్చర్యపరిచింది. బాహుబలి 1 హిట్ తరువాత రాజమౌళి శబరిమల వెళ్లారట. ఆ సమయంలో రాజమౌళి.. మలయాళ పరిశ్రమకు సంబంధించిన ఓ వ్యక్తిని కలుసుకున్నారు. అతనితో తనని డైరెక్టర్ ఫాజిల్ ని కలిపించామని రిక్వెస్ట్ చేశారట.

పుష్ప సినిమాతో మనకి పరిచయమైన గ్రేట్ యాక్టర్ ‘ఫహద్ ఫాజిల్’ తండ్రే ఈ ఫాజిల్. ఈయన దర్శకుడిగా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. తెలుగులో నాగార్జునతో ‘కిల్లర్’ అనే సినిమాని తెరకెక్కించారు. మలయాళం, తమిళంలో కూడా ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించారు ఫాజిల్. ఈయన సినిమాలు చూస్తూనే రాజమౌళి సినిమా పాఠాలు నేర్చుకున్నారట. ఫాజిల్ ని రాజమౌళి గురువుగా భవిస్తారట.

ఆ భక్తి భావంతోనే ఫాజిల్ ని కలిపించమని శబరిమల వెళ్ళినప్పుడు కోరారట. ఇక ఫాజిల్ ని చూసిన వెంటనే రాజమౌళి.. ఆయన కాళ్ళకి నమస్కరించారట. బాహుబలి వంటి సక్సెస్ అందుకున్న దర్శకుడు.. తన కాళ్ళకి నమస్కరించడం ఫాజిల్ ని కూడా షాక్ కి గురి చేసిందట. అంతటి విజయాన్ని అందుకున్న తరువాత మలయాళ పరిశ్రమకు చెందిన దర్శకులు కూడా అలా చేయరని, కానీ రాజమౌళి చేసారని. అది ఆయన సింప్లిసిటీ అంటూ ఆ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

 

Also Read : NTR : ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తే.. ఇలా వంట చేసి భోజనం పెట్టండి..

  Last Updated: 25 Mar 2024, 04:11 PM IST