Site icon HashtagU Telugu

SSMB 29: రాజమౌళి ఎన్టీఆర్ తో చేయాల్సిందే ఈ SSMB29

Ssmb 29 Update

Ssmb 29 Update

SSMB29: స్టార్ హీరోలను మించిన రేంజ్ రాజమౌళి ది. జక్కన్న (Rajamouli) సినిమా కోసం ఇప్పుడు హాలీవుడ్ (Hollywood) సైతం ఎదురుచూస్తుంది..! అలాంటిది తెలుగు టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తో సినిమా అంటే…! ఇక నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు అభిమానులు. ప్రపంచం మొత్తం చుట్టే [Globetrotting] కథతో రాబోతున్నారు ఈ ఇద్దరు. అంతకు మించి ఈ టీమ్ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయినప్పటికీ తరుచూ ఎదో ఒక ఊహాగానాలతో SSMB29 సోషల్ మీడియా ని షేక్ చేస్తూ ఉంది.

మహేష్ బాబు (Mahesh Babu) నటించబోయే 29వ సినిమా ఇది కావటంతో.. ఫాన్స్ ఈ ప్రాజెక్ట్ కి SSMB29 అని నామకరణం చేసారు. అయితే ఇటీవల ఆగష్టు 9 న సూపర్ స్టార్ పుట్టిన రోజు సంధర్భంగా… ఈ మూవీ టీమ్ నుంచి అప్డేట్ ఆశించారు అభిమానులు..! కానీ ఫ్యాన్స్ ని నిరాశపరిచారు రాజమౌళి (Rajamouli). కాగా, ఎవరు ఊహించని విధంగా ఇటీవల ఒక భారీ న్యూస్ (Big News) రివీల్ అయిందీ సినిమా నుంచి. ఈ సర్‌ప్రైజ్ తో ఫాన్స్ ఒకింత ఆనంద పడుతూనే… మరోవైపు విచారంలో ఉన్నారు.

మూవీ టెక్నిషియన్ (Visual Development Artist) ఒకతను మహేష్ పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రీసెంట్ గా వెలుగులోకి వచ్చాయి. సూపర్ స్టార్ ఫోటో పోస్ట్ చేసి… మీతో మళ్ళి పని చేయటానికి, SSMB29 కోసం ఎదురు చూస్తున్న అని రాసుకొచ్చి ఆఖరిగా 2028 చాల విలువైనది అంటూ అభిమానులకి షాక్ ఇచ్చారు. ఇది చుసిన ఫాన్స్ ఈ సినిమా కోసం ఇంకా నాలుగేళ్లు  ఎదురు చూడాలా అని నిరాశ చెందారు. అయితే ఒక ఫ్యామస్  మార్వెల్ హీరోని (Chris Hemsworth) కూడా ఈ పోస్ట్ లో టాగ్ చేయటంతో..! ఏ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోందో అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

అయితే రీసెంట్ గా టెక్నిషియన్ ఇంస్ట్గ్రామ్ లో పక్షి రెక్కలు పోలిన ఆకారాన్ని తన స్టోరీ లో పోస్ట్ చేసి…! టాగ్ SSMB29 అని ఇవ్వటంతో, ఈ సినిమా పేరు “గరుడ” (Garuda) అని…. గతంలో ఎన్టీఆర్ (NTR) తో రాజమౌళి చేయాలనుకున్న గరుడ అనే ప్రాజెక్ట్… ఇప్పుడు మహేష్ (Mahesh) తో చేస్తున్నారు అంటూ…! ఫ్యాన్స్ ఒక నిర్ణయానికి వచ్చేసారు.