Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు సీక్రెట్ గా చేసేసుకొని షూటింగ్ మొదలుపెట్టారు. అసలు సినిమా గురించి అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే ఓ సెట్ లో జరుగుతుంది. తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సింహాన్ని బంధించి మహేష్ బాబు పాస్ పోర్ట్ తన దగ్గర పెట్టుకున్నట్టు ఓ చిన్న వీడియో పోస్ట్ చేసాడు. మహేష్ రెగ్యులర్ గా విదేశాలకు వెళ్తాడని తెలిసిందే. అందుకే తన పాస్ పోర్ట్ ని రాజమౌళి దగ్గర పెట్టుకొని మహేష్ ని బంధించానని హింట్ ఇచ్చాడు ఈ వీడియోతో.
దీంతో ఇకపై సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది అని తెలుసుతుంది. అయితే రాజమౌళి పెట్టిన పోస్ట్ కి మహేష్ బాబు.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి ప్రమోషన్స్ అన్ని కొత్తగా ఉంటాయని తెలిసిందే. చిన్న అప్డేట్, పోస్ట్ తోనే సినిమాపై భారీ అంచనాలు తెప్పిస్తాడు. ఇప్పుడు SSMB29 సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని తెలుస్తుంది.
Also Read : Hathya Movie : ‘హత్య’ మూవీ రివ్యూ.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మరో సినిమా..