Site icon HashtagU Telugu

Magadheera : మగధీరలో ఆ ఐకానిక్ సీన్.. రాజమౌళి ఆ సినిమాలో నుంచి కాపీ చేశాడట..

Rajamouli said Magadheera Iconic Scene Copy From Chiranjeevi Super Hit Movie

Rajamouli said Magadheera Iconic Scene Copy From Chiranjeevi Super Hit Movie

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్ లో వచ్చిన సోషియో ఫాంటసీ డ్రామా ‘మగధీర’. రెండు జన్మల ప్రేమ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాని అల్లు అరవింద్ అప్పటిలో భారీ బడ్జెట్ తో నిర్మించడంతో ప్రతి ఒక్కరు నిర్మాత సాహసం చేస్తున్నాడని అనుకున్నారు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యాక వెండితెరపై విజువల్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దీంతో థియేటర్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది.

కాగా ఈ మూవీలో మెయిన్ హైలైట్ గతం జన్మ స్టోరీ. ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ భైరవ అనే వారియర్ గా కనిపించి అదరగొట్టాడు. పీరియాడిక్ స్టోరీలో వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ కి థ్రిల్ ని కలగజేశాయి. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లో భైరవ అండ్ విలన్ రణదీప్ బిల్లా మధ్య గుర్రం రేస్ జరుగుతుంది. ఆ సన్నివేశం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సీన్ లో రామ్ చరణ్ ఒక ఇసుక ఊబిలో పడిపోతాడు. ఆ ఊబి నుంచి చరణ్ ని తన గుర్రం కాపాడుతుంది. ఆ సీన్ ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ తెప్పించింది.

అయితే ఆ సీన్ ని రాజమౌళి.. చిరంజీవి (Chiranjeevi) సూపర్ హిట్ మూవీ నుంచి కాపీ చేశాడట. చిరు నటించిన కౌ బాయ్ మూవీ కొదమ సింహం (Kodama Simham) అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో విలన్స్.. చిరంజీవిని ఎడారిలో పీకల వరకు ఇసుకలో పాతేస్తారు. అప్పుడు చిరంజీవి గుర్రం అక్కడికి వచ్చి ఇసుక నుంచి బయటకి రావడానికి సహాయ పడుతుంది. అలా బయటకి వచ్చిన చిరు.. ఆ గుర్రం ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ అప్పటిలో ప్రతి ఒక్కరికి బాగా నచ్చేసింది.

కానీ రాజమౌళికి మాత్రం నచ్చలేదు. తనని ప్రమాదం నుంచి బయట పడేసిన గుర్రానికి చిరు.. కృతజ్ఞత చెప్పకపోవడం రాజమౌళికి బాధని కలిగించిందట. దీంతో మగధీరలో ఆ సీన్ రిఫరెన్స్ తీసుకోని చేసిన ఇసుక ఊబి సన్నివేశంలో రామ్ చరణ్ ప్రమాదం నుంచి బయట పడగానే ముందుగా గుర్రానికి కృతజ్ఞతలు తెలియజేసేలా రాజమౌళి సీన్ చిత్రీకరించాడు. నిజానికి ఆడియన్స్ కూడా అది బాగా నచ్చేసింది. ఆ సీన్ కి థియేటర్స్ లో అరుపులు, విజిల్స్ తో దద్దరిలింది.

 

Also Read : Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. కేసీఆర్‌కు ప్రత్యేక పిలుపు..