Site icon HashtagU Telugu

Rajamouli RGV : రాజమౌళి.. ఆర్జీవి.. స్పెషల్ ఇంటర్వ్యూ..!

Rajamouli Rgv Special Chit Chat Host By Rana Daggubati

Rajamouli Rgv Special Chit Chat Host By Rana Daggubati

ప్రస్తుతం తెలుగు సినిమా సాధిస్తున్న విజయాలు.. పొందుతున్నా ఆదరణ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దీనికి ఒక కారణం రాజమౌళి (Rajamouli) అని చెప్పడంలో సందేహం లేదు. జక్కన్న తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చాడు. అందుకే ఆయన సినిమా అంటే పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు. బాహుబలి, RRR స్పూర్తితో ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ప్రయత్నాలు జరిగాయి.

ఇక మరోపక్క అసలు తెలుగు సినిమా స్టామినాను పాన్ ఇండియా లెవెల్ లో చూపించిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ (RGV). ఆయన 30 ఏళ్ల క్రితం తీసిన శివ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ దశ దిశ మార్చిన డైరెక్టర్ గా ఆర్జీవి తన స్టామినా చూపించారు. ఐతే రాజమౌళి ఆర్జీవి ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటే ఎలా ఉంటుంది.

స్పెషల్ చిట్ చాట్ త్వరలో..

అలా ఒక స్పెషల్ చిట్ చాట్ త్వరలో జరగబోతుంది. ఆహా (Aha) లో అన్ స్టాపబుల్ సూపర్ హిట్ షో కాగా దాని స్పూర్తితోనే అమేజాన్ ప్రైం లో కూడా ఒక స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ షోకి రానా దగ్గుబాటి (Rana Daggubati,) హోస్ట్ గా చేస్తారని టాక్. ఈ స్పెషల్ షో మొదటి ఎపిసోడ్ లో రాజమౌళి, ఆర్జీవి ఇద్దరు కలిసి పాల్గొనబోతున్నారట.

అమేజాన్ ప్రైం భారీ లెవెల్ లో ఈ స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ స్పెషల్ షో కాన్సెప్ట్ ఏంటి.. ఈ ఇంటర్వ్యూస్ ఎలా ఉండబోతాయన్నది చూడాలి.

Also Read : Deepika Kumari : ఆర్చరీ వరల్డ్ కప్.. దీపికా కుమారికి రజతం