Rajamouli : సినిమా తీయమని ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అది కష్టం అన్న రాజమౌళి..

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్, దానికి రాజమౌళి ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Rajamouli reply for anand mahindra tweet goes viral

Rajamouli reply for anand mahindra tweet goes viral

రాజమౌళి(Rajamouli) RRR సినిమాతో ప్రపంచమంతా పాపులర్ అయ్యారు. హాలీవుడ్(Hollywood) టాప్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ సైతం రాజమౌళిని పొగిడేస్తున్నారు. రాజమౌళి RRR సినిమా అన్ని దేశాల ప్రేక్షకులని మెప్పించింది. ఇక ఇన్నాళ్లు ఒక కలగా ఉన్న ఆస్కార్(Oscar) అవార్డుని రాజమౌళి నాటు నాటు పాటతో భారతదేశానికి(India) తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్, దానికి రాజమౌళి ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. సింధు నాగరికతని ప్రతిబింబించే ఓ ఫోటోని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసి.. హరప్పా, మొహంజొదారోకి సంబంధించిన అప్పటి సంసృతిని మన కళ్ళముందు సజీవంగా చూపిస్తున్నాయి ఇవి. మన సింధు నాగరికత గురించి ప్రపంచానికి తెలియచేయాలని, దానిపై ఓ సినిమా తీయాలని రాజమౌళిని కోరుతున్నాను అని రాజమౌళిని ట్యాగ్ చేశారు.

ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ కి రాజమౌళి రిప్లై ఇస్తూ.. మగధీర సినిమా సమయంలో ఆ నాగరికతకు చెందిన ధోలవీరలో షూటింగ్ చేశాము. అప్పుడు నేను శిలాజంగా మారిన ఓ చెట్టును చూశాను. ఆ చెట్టుతో మన సింధు నాగరికత ఎదుగుదల, పతనం గురించి చెప్పేలా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు నేను పాకిస్థాన్ వెళ్ళినప్పుడు ఆ కథ కోసం మొహంజొదారో చూడటానికి చాలా ట్రై చేశాను కానీ పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. చాలా కష్టం, చాలా బాధగా ఉంది అని ట్వీట్ చేశారు. దీంతో రాజమౌళి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Chaitanya Master : బ్రేకింగ్.. ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్..

  Last Updated: 30 Apr 2023, 08:42 PM IST