RRR Movie: ఆర్ఆర్ఆర్ కు రెండేళ్లు.. త్రిబుల్ ఆర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు?

  • Written By:
  • Updated On - March 25, 2024 / 12:40 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు గడిచిపోయింది. అయినా సరే ఈ సినిమా సృష్టించిన మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. అది కూడా టాలీవుడ్ లో కాదు, హాలీవుడ్ లోనే ఎక్కువ వినిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ రెండేళ్లు పూర్తయ్యాయి. అనగా ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ని జపాన్ లో రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల అయ్యి రెండేళ్లు అయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కరోనా కారణంగా RRR సినిమా షూటింగ్ అనేక సార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా రిలీజ్ ని కూడా డేట్స్ అనౌన్స్ చేసి పలు మార్లు వాయిదా వేశారు. RRR అని వట్కింగ్ టైటిల్ అనుకున్నా చివరికి దాన్ని రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరూ కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే ఎలా ఉంటుంది అని ఊహాత్మక కథతో, అదిరిపోయే యాక్షన్స్ తో చరణ్, ఎన్టీఆర్ లతో భారీ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 550 కోట్లు. కరోనా కారణంగా కూడా సినిమా బడ్జెట్ కొంత పెరిగింది. ఇక ప్రమోషన్స్ కి దాదాపు 50 కోట్లు ఖర్చు చేసారని సమాచారం.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 1400 కోట్లు కలెక్ట్ చేసింది.

థియేట్రికల్ రిలీజ్ తర్వాత RRR సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయి కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ తోనే RRR సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. అన్ని దేశాల నుంచి నెట్‌ఫ్లిక్స్ లో RRR చూసి ప్రశంసలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా RRR పలు కేటగిరీల్లో 131 నామినేషన్స్ లో నిలిచింది. ఈ నామినేషన్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆస్కార్ అవార్డుతో సహా మొత్తం 60 అవార్డులు అందుకొని విజేతగా నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకొని మొదటి ఇండియన్ సాంగ్ గా నాటు నాటు సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఆస్కార్ అందుకున్న మొదటి తెలుగు వాళ్ళుగా కీరవాణి, చంద్రబోస్ సరికొత్త రికార్డ్ సెట్ చేసారు.