Site icon HashtagU Telugu

Rajamouli : రాజమౌళి మల్టీస్టారర్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అతనేనా..?

Rajamouli Planing Mahesh Movie As Multistarer

Rajamouli Planing Mahesh Movie As Multistarer

Rajamouli RRR తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే రాజమౌళి బాహూలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు చూస్తే సినిమాలో ఇద్దరు హీరోలను తీసుకున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా నటించగా ఆర్.ఆర్.ఆర్ కోసం తారక్, చరణ్ లను తీసుకున్నాడు.

ఇక మహేష్ సినిమా కోసం కూడా రాజమౌళి మరో హీరో కోసం చూస్తున్నాడని టాక్. రీసెంట్ గా జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ లో తనకు నచ్చే హీరో రణ్ బీర్ అని చెప్పాడు. మరోపక్క మహేష్ కూడా తన ఫేవరెట్ హీరో రణ్ బీర్ అని పొగిడాడు. స్టేజ్ మీద రణ్ బీర్, మహేష్ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. సో ఈ ఇద్దరిని ఎందుకు కలిపి సినిమా తీయకూడదు అనే ఆలోచన వస్తుంది.

రాజమౌళి సినిమా అంటే ఏ చిన్న పాత్ర అయినా నో చెప్పే అవకాశం లేదు. అందుకే మహేష్ రాజమౌళి చేస్తున్న సినిమాలో రన్ బీర్ కపూర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే మాత్రం మహేష్ 29వ సినిమా రేంజ్ ఊహించడం కూడా కష్టమే అవుతుంది.

Also Read : Nagarjuna : నాగార్జున నెక్స్ట్ సినిమా టైటిల్ అదేనా..?

We’re now on WhatsApp : Click to Join