Site icon HashtagU Telugu

Rajamouli : ఈగ, బాహుబలి, RRR మలయాళ రచయిత మరణంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..

Rajamouli Pay Tributes to Malayalam Star Writer Mankombu Gopalakrishnan

Rajamouli

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి మలయాళం స్టార్ రైటర్, గేయ రచయిత మంకంబు గోపాలకృష్ణన్ మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఆయన రాజమౌళి చేసిన ఈగ, బాహుబలి, RRR సినిమాలకు మలయాళ వర్షన్ రాసారు. దీంతో ఆయనతో రాజమౌళికి మంచి బంధం ఏర్పడింది.

రాజమౌళి తన ట్విట్టర్లో.. లెజెండరీ మలయాళం రచయిత మంకంబు గోపాలకృష్ణన్ సర్ మరణించారని తెలిసి బాధపడుతున్నాను. ఆయన లిరిక్స్, డైలాగ్స్, పద్యాలు చాలా ప్రభావం చూపించాయి. ఆయన ఈగ, బాహుబలి, RRR సినిమాలకు మలయాళం వర్షన్స్ రాయడం కోసం ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు. దీంతో రాజమౌళి పోస్ట్ వైరల్ గా మారింది.

మంకంబు గోపాలకృష్ణన్ 1974 నుంచి మలయాళ సినీ పరిశ్రమలో కథా రచయితగా, గేయ రచయితగా అనేక సినిమాలకు పనిచేసారు. ఆయన మరణంపై పలువురు మలయాళ సినీ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ ని ఒడిశా లోని కోరాపుట్ లో చేస్తున్నారు. మహేష్, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

 

Also Read : AR Rahman Chest Pain: ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పి గుండెపోటుకు సంకేతమా?