Rajamouli Nitin దర్శక ధీరుడు రాజమౌళి స్టార్ హీరోలతోనే కాదు యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. నితిన్, సునీల్, నాని లాంటి వారితో కూడా రాజమౌళి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. నాని తో ఈగ అఫ్కోర్స్ అందులో నాని పోర్షన్ తక్కువ ఉన్నా సినిమాలో నాని నటించడం అతని కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యింది. ఇక సునీల్ తో మర్యాద రామన్న తీసి కూడా సూపర్ హిట్ కొట్టాడు. నితిన్ తో సై తీసి సక్సెస్ అందుకున్నారు రాజమౌళి.
నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో సై ఒకటి. ఈ సినిమా అంతా రగ్బీ నేపథ్యంతో సాగుతుంది. ఈ సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వినాయక చవితి సందర్భంగా నితిన్ సై సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు. రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.
నితిన్ రాజమౌళి కాంబోలో..
నితిన్ (Nitin) కు జతగా జెనిలియా నటించిన ఈ సినిమా రీ రిలీజ్ (Sye Rerelease) డేట్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. నితిన్ రాజమౌళి ఈ కాంబోలో వచ్చిన ఏకైక సినిమా సై. అప్పటి యూత్ ని అలరించిన ఈ సినిమా రీ రిలీజ్ టైం లో అప్పటి యూత్ ఆడియన్స్ మళ్లీ ఈ సినిమా కోసం పరుగులు పెడతారేమో చూడాలి.
నితిన్ కు కూడా ఈ సినిమా రీ రిలీజ్ మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా వేణు శ్రీరాం డైఎక్షన్ లో తమ్ముడు చేస్తున్నాడు. ఈ సినిమాల విషయంలో నితిన్ సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. నితిన్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలంటే మాత్రం ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ కొట్టాల్సి ఉంటుంది. నితిన్ రాబిన్ హుడ్ ఈ డిసెంబర్ కి రిలీజ్ లాక్ చేయగా గేం చేంజర్ వస్తుంది కాబట్టి సినిమా వాయిదా వేస్తరని టాక్.
Also Read : Vetayyan Postpone : వెటయ్యన్ కూడా రిలీజ్ డౌటేనా..?