Site icon HashtagU Telugu

Rajamouli – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో రాజమౌళి చర్చలు..

Pawan Rajamuli

Pawan Rajamuli

సినీ అభిమానులు , మెగా అభిమానులు ఎప్పటి నుండి రాజమౌళి – పవన్ కళ్యాణ్ (Rajamouli -Pawan Kalyan) లో ఓ సినిమా పడితే చూడాలని కోరుకుంటున్నారు. కానీ ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో..అసలు తీరుతుందో లేదో అనేది తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ అనుకున్న కానీ కుదరలేదని రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ కు సెట్ అయ్యే కథను నేను సిద్ధం చేయలేనని కూడా చెప్పాడు. కానీ అభిమానుల్లో మాత్రం వీరి కలయికలో సినిమా చూడాలనే కోరిక మాత్రం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తాజాగా పవన్ కళ్యాణ్ – రాజమౌళి ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకొని చేతితో చేయి పట్టుకొని నవ్వుతు మాట్లాడుతున్న పిక్స్ , వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇది సినిమా కోసం అయితే కాదు. ఇటీవల కాలం చేసిన ప్రముఖులు రామోజీరావు స్మరణ సభకి వీరు అథిధులుగా రాగా అక్కడ ఒకరినొకరు కలుసుకొని పలకరించుకున్నారు. ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ (Ramoji Rao Memorial Program) గురువారం విజయవాడలోని కానూరులో అట్టహాసంగా జరిగింది. ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరై రామోజీరావు కు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, మనోహర్‌, సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, పార్థసారథి, రాజమౌళి, కీరవాణి తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు రాజమౌళి వచ్చి కాసేపు ముచ్చటించారు. ఎన్నికల్లో విజయం సాధించి కీలక పదవులు తీసుకున్నందుకు గాను పవన్ కు అభినందనలు తెలిపారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకొని చేతితో చేయి పట్టుకొని నవ్వుతు మాట్లాడారు. దీని తాలూకా పిక్స్ , వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : Reliance Jio : కస్టమర్లకు షాక్ ఇచ్చిన JIO