Maryada Ramanna : దర్శకుడు ధీరుడు రాజమౌళి, కమెడియన్ సునీల్ తో తీసిన సినిమా ‘మర్యాద రామన్న’. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రాజమౌళి ఈ కామెడీ సినిమాని తెరకెక్కించారు. యాక్షన్ అండ్ ఎమోషన్ తో ఆడియన్స్ ని అలరించే రాజమౌళి.. ఆ సినిమాతో తాను కామెడీతో కూడా ఎంటర్టైన్ చేయగలరని నిరూపించారు. అయితే ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమా ఒక హాలీవుడ్ మూవీకి కాపీగా వచ్చింది.
కాపీ అంటే ఏదో కొన్ని కామెడీ సీన్స్ లేక ఇంటి గడప దాటితే ప్రాణాలు తీసేస్తారు అని క్రేజీ ఐడియాని మాత్రమే కాపీ కొట్టడం కాదు, ఆల్మోస్ట్ సినిమా మొత్తాన్ని చిన్న చిన్న చేంజెస్ తో కాపీ కొట్టేసారు. ఇంతకీ ఆ హాలీవుడ్ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా..?
ఆ మూవీ పేరు ఏంటంటే.. అవర్ హాస్పిటాలిటీ (Our Hospitality). ఇది ఒక సైలెంట్ కామెడీ సినిమా. 1923లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కథ ఏంటంటే.. తన సొంత ఊరుకి దూరంగా బ్రతుకుతున్న హీరోకి, తన ఆస్థి గురించి తెలుస్తుంది. ఆ ఆస్థి కోసం సొంత ఊరుకి బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇక ఆ ఊరుకి వెళ్లిన తరువాత శత్రువు ఇంటికి శత్రువునే దారి అడగడం, తమ ఇంటికి వచ్చిన హీరో తమ శత్రువు అని తెలుసుకున్న విలన్స్, హీరో గడప దాటగానే చంపేయాలని చూస్తుంటారు.
ఇలా కథంతా ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడ కత్తులు ఉంటే, అక్కడ గన్స్ ఉంటాయి. ఇక్కడ హీరో జాతరో తప్పించుకుంటే, అక్కడ లేడీ గెటప్ లో తప్పించుకుంటాడు. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో సైకిల్ కామన్.
నిజానికి రాజమౌళి ఈ సినిమా రైట్స్ తీసుకోని అఫీషియల్ గా రీమేక్ చేయాలని భావించారు. కానీ ఆ సినిమాకి పని చేసిన వారు ఎవరు బ్రతికి లేకపోవడంతో.. రాజమౌళి రైట్స్ తీసుకోకుండానే రీమేక్ చేసేసారు.